Begin typing your search above and press return to search.

జాన్వీ.. ఇది బిగ్గెస్ట్ టాస్క్

ఇప్పటికే బాలీవుడ్ లో పలు సినిమాల్లో యాక్ట్ చేసిన అమ్మడు.. త్వరలో టాలీవుడ్ లోకి అడుగు పెట్టనుంది.

By:  Tupaki Desk   |   16 Sep 2024 8:30 PM GMT
జాన్వీ.. ఇది బిగ్గెస్ట్ టాస్క్
X

అలనాటి నటి శ్రీదేవి వారసురాలిగా హీరోయిన్ జాన్వీ కపూర్.. సినీ ఇండస్ట్రీలోకి ఇప్పటికే ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ మంచి పేరు సంపాదించుకుంది. తనదైన అందం, గ్లామర్ ను సొంతం చేసుకుని.. చిత్ర పరిశ్రమలో సూపర్ క్రేజ్ దక్కించుకుంది. ఇప్పటికే బాలీవుడ్ లో పలు సినిమాల్లో యాక్ట్ చేసిన అమ్మడు.. త్వరలో టాలీవుడ్ లోకి అడుగు పెట్టనుంది.

అప్పుడు శ్రీదేవి సీనియర్ ఎన్టీఆర్ తో నటిస్తే.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనుంది జాన్వీ కపూర్. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవర పార్ట్-1తో టాలీవుడ్ సినీ ప్రియులను పలకరించనుంది. సినిమాలో తంగం పాత్ర పోషిస్తోంది జాన్వీ. అచ్చ పల్లెటూరి అమ్మాయిగా సందడి చేయనుంది. డెబ్యూ మూవీతో తెలుగులో మంచి హిట్ అందుకోవాలని చూస్తోంది అమ్మడు.

అయితే జాన్వీ.. తెలుగు ఎంట్రీ విషయంలో భారీ సవాళ్లు ఎదుర్కోనుందని అంతా చెబుతున్నారు. శ్రీదేవికి ఫ్యాన్ బేస్ వేరే లెవెల్ లో ఉండేది. కాబట్టి.. ఇప్పుడు వారసురాలిపై కచ్చితంగా ఒత్తిడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. దానికి తోడు ఎన్టీఆర్.. యాక్టింగ్, డ్యాన్స్ గురించి తెలిసిందే. దీంతో ఆయన రేంజ్ కు తగ్గట్టు ఆమె ప్రెజెన్స్ ఉండాలని అంటున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందనున్న మూవీ.. కనుక ఆమె హీరోయిన్ గా కచ్చితంగా మెప్పించాల్సి ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు.

కాగా, దేవరలో ఆమె రోల్.. రూరల్ రస్టిక్ గా ఉండనున్నట్లు ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. గతంలో వచ్చిన రంగస్థలంలో సమంత, పుష్పలో రష్మిక పాత్రలు కూడా అలాంటివే. వాళ్లిద్దరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. కానీ ఇప్పటి వరకు దేవర మేకర్స్ రిలీజ్ చేసిన లుక్స్ లో జాన్వీ తన పాత్రలో ఒదిగి పోయినట్లు కనిపించడం లేదని చెబుతున్నారు. అదే సమయంలో ట్రైలర్, పోస్టర్స్ బట్టి క్లారిటీ ఇవ్వలేమని అంటున్నారు.

సినిమా రిలీజ్ అయ్యాక.. జాన్వీ స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు పాత్రలో ఒదిగిన తీరు తెలుస్తుందని చెబుతున్నారు. రీసెంట్ గా జాన్వీ క్యారెక్టర్ రాయడం చాలా కష్టమైందని కొరటాల చెప్పిన విషయం తెలిసిందే. దాని బట్టి ఆమెకు మంచి స్కోప్ ఉన్న రోల్ దొరికినట్లు ఉందని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా జాన్వీకి దేవర మూవీ బిగ్ టాస్కే అని చెబుతున్నారు. మరి అమ్మడు.. తన తెలుగు డెబ్యూ సినిమా విషయంలో సవాళ్లను ఎలా ఎదుర్కొంటుందో.. ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో వేచి చూడాలి.