యువ హీరో మళ్లీ కొట్టి చూపించాలి..!
కెరీర్ రిస్క్ లో పడుతుందని త్వరగానే గుర్తించిన ఈ హీరో కాస్త టైం తీసుకుని క తో మళ్లీ సెట్ రైట్ అయ్యాడు.
By: Tupaki Desk | 2 March 2025 2:45 AM GMTతెలుగు యువ హీరోల్లో ఈమధ్య కాలంలో ప్రేక్షకులకు దగ్గరైన కథానాయకుడు కిరణ్ అబ్బవరం. అతను చేస్తున్న సినిమాలు ఆడియన్స్ ని అలరిస్తున్నాయి. రాజా వారు రాణి గారుతో హీరోగా కెరీర్ మొదలు పెట్టిన కిరణ్ అబ్బవరం ఎస్.ఆర్ కళ్యాణమండపం తో సక్సెస్ అందుకుని అలా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఐతే యువ హీరోగా మంచి ట్రాక్ మీద ఉన్న అతను మధ్యలో కొన్ని సినిమాల వల్ల గ్రాఫ్ పడిపోయేలా చేసుకున్నాడు. కెరీర్ రిస్క్ లో పడుతుందని త్వరగానే గుర్తించిన ఈ హీరో కాస్త టైం తీసుకుని క తో మళ్లీ సెట్ రైట్ అయ్యాడు.
క సినిమా తో కిరణ్ అబ్బవరం సత్తా ఏంటో తెలిసింది. ఆ సినిమా ఇచ్చిన బూస్టింగ్ తో ఇక మీదట మరిన్ని మంచి కథలను తెర మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఐతే క తర్వాత నెక్స్ట్ ఈ హీరో దిల్ రూబాతో వస్తున్నాడు. చూస్తుంటే ఇది రెగ్యులర్ రొమాంటిక్ లవ్ స్టోరీగానే అనిపిస్తుంది. క తర్వాత మళ్లీ రెగ్యులర్ పంథాలోకి వెళ్తే రిస్క్ అని తెలిసినా కిరణ్ దిల్ రూబాతో మళ్లీ అలాంటి అటెంప్టే చేస్తున్నాడు.
ఐతే దిల్ రూబా టీజర్ ట్రైలర్ కాదు సినిమాలో మ్యాటర్ వేరే ఉంటుందని అంటున్నారు. సినిమాను విశ్వ కరుణ్ డైరెక్ట్ చేయగా చాలా నీట్ గా అనుకున్న కథను హ్యాండిల్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. క ప్రభావం వల్ల దిల్ రూబా ప్రచార చిత్రాలకు మంచి బజ్ వచ్చింది. మార్చి 14న వస్తున్న దిల్ రూబాతో కూడా కిరణ్ అబ్బవరం హిట్ కొట్టి చూపించాలి అప్పుడు కానీ ఈ హీరో కెరీర్ స్టాండర్డ్ అనిపించుకుంటుంది.
తన పంథాలో తన సినిమాలు చేస్తూ వెళ్తున్న కిరణ్ అబ్బవరం ఆడియన్స్ అటెన్షన్ ని గ్రాబ్ చేస్తున్నాడు. క తర్వాత దిల్ రూబా కరెక్ట్ సినిమా అని అతను నమ్ముతున్నాడు. మరి నిజంగానే కిరణ్ కి దిల్ రూబా సక్సెస్ రేసు కొనసాగేలా చేస్తుందా లేదా అన్నది చూడాలి. దిల్ రూబా సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటించింది. అమ్మడికి కూడా ఇదే చివరి అవకాశమని చెప్పొచ్చు. ఈమధ్య అసలు అవకాశాలు అందుకోని రుక్సర్ దిల్ రూబాలో గ్లామర్ తో కూడా రెచ్చిపోయినట్టు అనిపిస్తుంది.
మరి క హిట్ మేనియా దిల్ రూబాతో కిరణ్ కొనసాగిస్తాడా.. రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాతో రుక్సర్ కి హిట్ దక్కుతుందా.. కిరణ్ ని ఇష్టపడే ఆడియన్స్ కి దిల్ రూబా కిక్ ఇస్తుందా అన్నది తెలియాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే.