'దబిడి దిబిడి'పై కౌంటర్- ఎన్ కౌంటర్!
ఆ పాట కంపోజ్ చేసిన కోరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పై నెటి జనులు నిప్పుల వర్షం కురిపించారు.
By: Tupaki Desk | 9 Jan 2025 10:13 AM GMT'డాకు మహారాజ్' లో బాలకృష్ణ- ఊర్వశీ రౌతేలా పై చిత్రీకరించిన 'దబిడి దబిడి' సాంగ్ ఎంత సంచలనమైందో తెలిసిందే. రిలీజ్ అయిన నిమిషాల్లోనే నెట్టింట వైరల్ గా మారింది. బాలయ్య మాస్ స్టెప్పులతో అదరగొట్టేసారు. అయితే ఊర్వశీ రైతేలా పిరుదలపై బాలయ్య చేతులతో మోదడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కున్నారు. ఆ పాట కంపోజ్ చేసిన కోరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పై నెటి జనులు నిప్పుల వర్షం కురిపించారు.
బాలయ్య, ఊర్వశీరౌతేలా, శేఖర్ మాస్టర్ అంతా నెటి జనులకు టార్గెట్ అయ్యారు. తాజాగా ఈ పాటపై బాలీవుడ్ క్రిటిక్ కేఆర్కే కూడా మండిపడ్డారు. 'తెలుగు వారు అలాంటి విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గరు. కానీ ఊర్వశీ రౌతేలా అలా చేయడం తనకేమాత్రం సిగ్గుగా అనిపించలేనట్లుందని విమర్శించారు. ఈ ట్వీట్ పై ఊర్వశీ రౌతేలా మండిపడింది.' ఏం సాధించలేని కొందరు కష్టపడే వారిని విమర్శించే అర్హత ఉందనుకోవడం విడ్డూరం.
రియల్ పవర్ అంటే ఇతరులను విమర్శించడం కాదు. అవతలి వారిపై తీసుకొచ్చేలా చేయడం, వారి గొప్పతనాన్ని ఆదర్శంగా తీసుకోవడంలో ఉంటుంద`ని కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఊర్వశీ ట్వీట్ పై కేఆర్కే మళ్లీ ఏదైనా రిప్లై ఇస్తారా? అన్నది చూడాలి. బాలయ్య సినిమాల్లో ఇలాంటి పాటలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఆయన ఇమేజ్ ని బేస్ చేసుకుని కొరియోగ్రాఫర్లు స్టెప్స్ కంపోజ్ చేస్తుంటారు. అవి మరీ వల్గర్ గా ఉండవు.
ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటాయి. బాలయ్య గత సినిమా పాటల్ని చూసినా? ఇలాంటి స్టెప్స్ కనిపిస్తుంటాయి. బాలయ్య తరం హీరోలు చాలా మంది ఇలాంటి పాటల్లో నటించిన సందర్భాలున్నాయి. కానీ నేటి సోషల్ మీడియా యుగంలో? ఇలాంటి పాటలకు ప్రశంసలు కంటే విమర్శలకే ఎక్కువ ఆస్కారం ఉంది. దడిడి దిబిడి విషయం లోనూ అదే జరిగిందని అభిమానులు చెబుతున్నారు. ఈ సినిమా జనవరి 12న భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే.