Begin typing your search above and press return to search.

చియాన్ విక్రం కోరిక మణిరత్నం నెరవేరుస్తాడా..?

ఐతే తంగలాన్ సినిమా సౌత్ అన్ని భాషల్లో ఆగష్టు 15న రిలీజ్ కాగా హిందీ వెర్షన్ మాత్రం త్వరలో రిలీజ్ అవుతుంది.

By:  Tupaki Desk   |   31 Aug 2024 3:39 AM GMT
చియాన్ విక్రం కోరిక మణిరత్నం నెరవేరుస్తాడా..?
X

కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రం ఈమధ్యనే తంగలాన్ తో మంచి సక్సెస్ అందుకున్నారు. ఆగష్టు 15న రిలీజైన తంగలాన్ సినిమా అన్ని చోట్ల ఏమో కానీ తమిళంలో మాత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రతి సినిమాకు తన విలక్షణతను చూపించే విక్రం తంగలాన్ తో మరోసారి తన వర్సటాలిటీ చూపించారు. ఐతే తంగలాన్ సినిమా సౌత్ అన్ని భాషల్లో ఆగష్టు 15న రిలీజ్ కాగా హిందీ వెర్షన్ మాత్రం త్వరలో రిలీజ్ అవుతుంది. అందుకే చియాన్ విక్రం అండ్ టీం మరోసారి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు.

ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఐశ్వర్యతో తన స్క్రీన్ షేరింగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు విక్రం. ఐశ్వర్య గొప్ప నటి ఆమెతో నా ఆన్ స్క్రీన్ షేరింగ్ చాలా బాగుంటుందని అన్నారు. ఐశ్వర్య మాత్రమే కాదు ఆమె భర్త అభిషేక్ బచ్చన్ కూడా తనకు మంచి స్నేహితుడని అన్నారు విక్రం. అతనితో తనకు మంచి రిలేషన్ ఉందని అన్నారు. ఐతే ఐశ్వర్యతో నటించిన రెండు సినిమాల్లో సరైన ముగింపు ఉండదని. రెండిటిలో ప్రేమ కథలు అర్ధాంతరంగా ముగుస్తాయని అన్నారు.

రావన్ సినిమాలో అంతగా ప్రేమించిన అతను క్లైమాక్స్ లో చనిపోతాడు. ఇక పొన్నియిన్ సెల్వన్ లో కూడా ఆదిత్య కరికాలన్ గా విక్రం, నందిని గా ఐశ్వర్య ప్రేమించుకున్నా నందినికి మరొకరితో పెళ్లి జరుగుతుంది. ఆదిత్య కరికాలన్ పాత్ర కూడా మృతి చెందుతుంది. మణిరత్నం తెరకెక్కించిన ఈ రెండు సినిమాలు ఎండింగ్ ఫ్యాన్స్ ని బాధ పెట్టాయని అందుకే మణిరత్నం కు మా ఇద్దరి పాత్రలకు సంతోషకరమైన ముగింపు ఉండేలా ఒక సినిమా తీయమని రిక్వెస్ట్ చేశానని అన్నారు విక్రం.

ఐతే విక్రం అడిగినంత మాత్రాన మణిరత్నం తీస్తారా అన్నది తెలియదు కానీ ఐశ్వర్యతో తన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుటుందని చెప్పి ఫ్యాన్స్ ని అలరించారు విక్రం. తంగలాన్ తో తిరిగి ఫాంలోకి వచ్చినట్టుగానే కనిపిస్తున్న విక్రం వరుస సినిమాలతో ఫ్యాన్స్ ని మెప్పించాలని ఫిక్స్ అయ్యారు. కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన విక్రం ఒకప్పుడు హిట్ల మీద హిట్లు కొట్టారు. ఐతే ఈమధ్య ఆయన చేస్తున్న సినిమాలు ఏవి బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు ఇవ్వలేదు. విక్రం నటించిన సినిమాలు చాలా వరకు రిలీజ్ వాయిదాలు పడుతూ వచ్చాయి. అలా రావడం వల్ల సినిమా మీద ప్రేక్షకులకు ఉన్న ఆసక్తి కూడా కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.