Begin typing your search above and press return to search.

మారుతికి రుణం తీర్చుకునే అవ‌కాశం ఇప్పుడొచ్చిందా!

అయితే ఆ ప్ర‌తిభ‌ను నిరూపించుకునే అవ‌కాశాలు కెరీర్ ఆరంభంలో కొంత మంది నిర్మా త‌లు క‌ల్పించ‌డంతోనే నేడు ఆ పొజిష‌న్ లో ఉన్నాడు అన్న‌ది అంతే వాస్త‌వం.

By:  Tupaki Desk   |   29 March 2025 6:30 PM
మారుతికి రుణం తీర్చుకునే అవ‌కాశం ఇప్పుడొచ్చిందా!
X

మారుతి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలో ఎదిగిన డైరెక్ట‌ర్. 'ఈరోజుల్లో' అనే చిన్న సినిమాతో కెరీర్ ప్రారంభించి నేడు పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ని డైరెక్ట్ చేస్తున్నాడంటే? అంతా అత‌డి ప్ర‌తిభ‌తోనే సాధ్య‌మైంది. అయితే ఆ ప్ర‌తిభ‌ను నిరూపించుకునే అవ‌కాశాలు కెరీర్ ఆరంభంలో కొంత మంది నిర్మా త‌లు క‌ల్పించ‌డంతోనే నేడు ఆ పొజిష‌న్ లో ఉన్నాడు అన్న‌ది అంతే వాస్త‌వం. అందులో బెల్లంకొండ సురేష్‌ ముందులో ఉన్నారు.

మారుతి వినిపించిన 'బ‌స్ స్టాప్' క‌థ‌ను నిర్మించ‌డానికి ముందుకొచ్చింది అప్ప‌ట్లో బెల్లంకొండ‌నే. చాలా మంది నిర్మాత‌లు ఆ క‌థ విని వ‌ల్గ‌ర్ కంటెంట్ గా భావించి నిర్మించ‌డానికి ఎవ‌రూ ముందుకు రాలేదు. అదే స‌మ‌యంలో బెల్లంకొండ సురేష్ ముందుకు రావ‌డంతో? అది ప‌ట్టాలెక్కింది. త‌క్కువ బ‌డ్జెట్ లో నిర్మించిన సినిమా అప్ప‌ట్లో మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. దీంతో నిర్మాత‌కు మంచి లాభాలు వ‌చ్చాయి.

అలా మారుతి డైరెక్టర్ గా నిరూపించుకున్నాడు. అటుపై మారుతి టైర్ 2 హీరోల‌కు ప్ర‌మోట్ అయ్యాడు. నాని, నాగ‌చైత‌న్య‌, రామ్ లాంటి హీరోలను డైరెక్ట్ చేసి స‌క్స‌స్ అయ్యాడు. అయితే మారుతికిప్పుడు రుణం తీర్చుకునే అవ‌కాశం వ‌చ్చింది. బెల్లంకొండ త‌న‌యుడు సాయి శ్రీనివాస్ స‌క్సెస్ కోసం ఎలాంటి పోరాటం చేస్తున్నాడో తెలిసిందే. హీరో క‌టౌట్ అయినా స‌రైన హిట్ ప‌డ‌టం లేదు. చేసిన సినిమాలు క‌లిసి రావ‌డం లేదు.

ఈ నేప‌థ్యంలో త‌న‌యుడితో ఓ సినిమా చేయాల్సిందిగా మారుతిని బెల్లంకొండ సురేష్ కోరిన‌ట్లు ఫిలిం స‌ర్కిల్స్ లో వినిపిస్తుంది. మారుతితో ఉన్న పాత ప‌రిచ‌యంతో ఈ ఛాన్స్ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి సినిమా చేయాలా? లేదా? అన్న‌ది మారుతి చేతుల్లో ఉంది. ఈ విష‌యాన్ని ఆయ‌న ఎలా తీసుకున్నాడు? అన్న‌ది తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం సాయి శ్రీనివాస్ ఖాళీగా లేడు. ఓ మూడు సినిమాలు చేస్తున్నాడు. మారుతి ఒకే చెప్పినా వాటి త‌ర్వాతే ఈ కాంబినేష‌న్ లో సినిమా ఉంటుంది.