ఆ రేంజ్ కి వెళ్లడానికి చౌదరి బ్యూటీకి ఛాన్సుందా!
సౌత్ నుంచి నార్త్ కి వెళ్లి ఈరేంజ్ లో సక్సెస్ అయింది ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొణే తర్వాత రష్మికనే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
By: Tupaki Desk | 24 Feb 2025 4:30 PM GMTసాయి పల్లవి, రష్మికా మందన్నా సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద సక్సెస్ అయ్యారు? అన్నది చెప్పాల్సిన పనిలేదు. వాళ్లకొచ్చిన పేరు, తీసుకుంటోన్న పారితోషికం, చేస్తోన్న సినిమాలు చూస్తే కెరీర్ పరంగా వాళ్ళు ఏస్థాయిలో ఉన్నారన్నది అంచనావేయోచ్చు. టాలీవుడ్ సహా బాలీవుడ్ లోనూ గొప్ప చిత్రాల్లో నటిస్తున్నారు. సౌత్ నుంచి నార్త్ కి వెళ్లి ఈ రేంజ్ లో సక్సెస్ అయింది ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొణే తర్వాత రష్మికనే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
'రామాయణం' రిలీజ్ తర్వాత సాయి పల్లవి కూడా వాళ్ల సరసన చేరుతుందనే అంచనాలు బలంగా ఉన్నాయి. మరి రష్మిక, సాయిపల్లవి సరసన మీనాక్షి చౌదరి కూడా చేరుతుందా? అంటే అవుననే టాక్ వినిపిస్తుంది. మీనాక్షిలో ప్రతిభని త్రివిక్రమ్ తొలి సినిమా రిలీజ్ కి ముందే కేవలం ప్రోమోస్ చేసే డిసైడ్ చేసేసాడు. తనకి ఇండస్ట్రీలో మంచి భవిష్యత్ ఉంటుందని. ఆయన అన్నట్లే మీనాక్షి టాలీవుడ్ లో సక్సెస్ అయింది.
అగ్ర హీరోల చిత్రాల్లో అవకాశాలు అందుకుంటుంది. ఇటీవలే 'సంక్రాంతికి వస్తున్నాం' విజయంతో ఏకంగా 300 కోట్ల వసూళ్ల చిత్రంలోనూ భాగమైంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'విశ్వంభర'లో కీలక పాత్ర పోషిస్తుంది. హీరోయిన్ ఛాన్స్ కాదు గానీ...అంతకు మించిన బలమైన పాత్రలో మెప్పిస్తుందని టీమ్ చెబుతుంది. సినిమాల సంగతి పక్కన బెడితే? మీనాక్షి చౌదరి కూడా సాయి పల్లవి తరహాలో గ్లామర్ క్వీన్ కాదు.
ఎంతో డీసెంట్ డ్రెస్సింగ్ సెన్స్ తో అలరిస్తుంది. ఆన్ స్క్రీన్ పైనా గ్లామర్ పాత్రలకు మరీ అంత ఛాన్స్ ఇవ్వలేదు. స్కిన్ షో వరకూ పరిమితం. అంతకు మించి బోర్డర్ దాటుతున్నట్లు కనిపించలేదు. నటిగా సక్సెస్ అవ్వాలంటే తెరపై అందంగా మాత్రమే కనిపించాల్సిన పనిలేదని...ఎంచుకునే పాత్రలు...నటన మాత్రమే గొప్ప స్థానంలో నిలబెడతాయి? అన్న వ్యాఖ్యలతోనూ మీనాక్షి లో కమిట్ మెంట్ ప్రశంసించ దగ్గది. నటిగా తనకంటూ కొన్ని పరిమితులు విధించుకునే కొనసాగుతున్నాని తెలిపింది. మరి ఇవన్నీ మీనాక్షిని స్టార్ భామల సరసన కూర్చబెడతాయా? లేదా? అన్నది చూడాలి.