సీనియర్లలో సెంచరీ కొట్టాల్సింది అతనొక్కడే!
అందుకే మెగాస్టార్ అంటే ? ఈ నలుగురిలో ప్రత్యేకం. చిరంజీవిని అన్నయ్య అంటూ ఎంతో ఆప్యాంగా నాగార్జున పిలుస్తారు.
By: Tupaki Desk | 21 Jan 2025 1:10 PM GMTమెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జునలు దాదాపు ఒక తరం హీరోలు. ఈ నలుగుర్ని ఇండస్ట్రీ సహా ప్రేక్షకులు అలాగే చూస్తారు. బాలయ్య, వెంకీ, నాగ్ లు స్టార్ కిడ్స్ అయినా? ప్రతిభతోనే ఎదిగారు. తండ్రుల ఇమేజ్ తమ పై పడకుండా పైకొచ్చారు. చిరంజీవి మాత్రం సోలోగా ఎదిగిన నటుడు. అందుకే మెగాస్టార్ అంటే ? ఈ నలుగురిలో ప్రత్యేకం. చిరంజీవిని అన్నయ్య అంటూ ఎంతో ఆప్యాంగా నాగార్జున పిలుస్తారు.
నాగార్జున డాన్సులకు స్పూర్తి చిరంజీవి. ఆ సంగతి పక్కన బెడితే సీనియర్ హీరోల్లో చిరంజీవి, బాలయ్య 100 కోట్ల క్లబ్లో ఎప్పుడో చేరిపోయారు. ఇప్పటికే వాళ్లిద్దరు నటించిన సినిమాలు 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన కొన్ని చిత్రా లున్నాయి. ఇటీవలే విక్టరీ వెంకటేష్ కూడా సోలోగా సెంచరీ కొట్టేసారు. ఇటీవల రిలీజ్ అయిన 'సంక్రాంతికి వస్తున్నాం'? విజయంతో ఇది సాధ్యమైంది. ఇప్పటికే సినిమా 200 కోట్ల మార్క్ ని దాటిపోయింది.
300 కోట్లు కలెక్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇంకా చెప్పాలంటే చిరు..నాగ్ లను సైతం విక్టరీ బీట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. వాస్తవానికి వెంకటేష్ నటించిన 'ఎఫ్ -2' చిత్రంతోనే సెంచరీ కొట్టేసారు. అయితే ఇది ఆయన సోలో సక్సెస్ కాదు. అదే సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా నటించాడు. అలా సోలో క్రెడిట్ వెంకీ అప్పుడు మిస్సైనా ఇప్పుడు మాత్రం సాలిడ్ సెంచరీ కొట్టారు. ఇక వీళ్లలో సెంచరీ కొట్టాల్సింది కేవలం నాగార్జున మాత్రమే.
ఇప్పటి వరకూ కింగ్ నటించిన ఏ సినిమా 100 కోట్ల మార్క్ ను దాటలేదు. ఇతర స్టార్లతో కలిసి నటించిన సినిమాలు కూడా ఆ మార్క్ ని టచ్ చేయలేదు. దీంతో కింగ్ ఖాతాలో సెంచరీ లేదనే బెంగ అభిమానుల్లో ఉంది. అయితే 'కుబేర'తో ఆ ఛాన్స్ ఉంది. కానీ సోలో గా ఆ క్రెడిట్ ఇవ్వలేం. ఎందుకంటే అందులో మెయిన్ లీడ్ పోషిస్తుంది కోలీవుడ్ నటుడు ధనుష్. మరి కింగ్ సోలోగా సెంచరీ 2025 ముగిసే లోపు కొడతారేమో చూడాలి.