Begin typing your search above and press return to search.

పవన్ vs విజయ్.. మధ్యలో నాని

అందుకే చాలా మంది మేకర్స్ ఆరు నెలలు, ఏడాది ముందుగానే సినిమాల రిలీజ్ డేట్స్ ని కన్ఫర్మ్ చేసేస్తున్నారు.

By:  Tupaki Desk   |   2 Sep 2024 6:14 AM GMT
పవన్ vs విజయ్.. మధ్యలో నాని
X

పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత సినిమాలు స్టార్ట్ చేసినపుడు లేదంటే షూటింగ్ జరుగుతూ ఉండగానే రిలీజ్ డేట్స్ కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇలా చేయడం వలన సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచొచ్చని దర్శక, నిర్మాతల ఆలోచన. అలాగే ముందుగానే రిలీజ్ డేట్ ప్రకటించడం వలన ఎక్కువ థియేటర్స్ ని పొందే వెసులుబాటు ఉంటుంది. అందుకే చాలా మంది మేకర్స్ ఆరు నెలలు, ఏడాది ముందుగానే సినిమాల రిలీజ్ డేట్స్ ని కన్ఫర్మ్ చేసేస్తున్నారు.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న VD12 మూవీ షూటింగ్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో రెండు భిన్నమైన లుక్స్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా కోసం విజయ్ చాలా కష్టపడుతున్నాడు. మూవీపైన అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాని 2025 మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

మరోవైపుపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న OG మూవీ షూటింగ్ దశలో ఉంది. నిజానికి ఈ సినిమాని సెప్టెంబర్ 27న రిలీజ్ చేయాలని సుజిత్ అనుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ కారణంగా అనుకున్న టైంకి షూటింగ్ ఫినిష్ కాలేదు. త్వరలో మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఈ చిత్రాన్ని 2025 మార్చి లేదా ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి ప్లానింగ్ చేసుకుంటున్నారంట. ఈ మూవీ రిలీజ్ డేట్ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు.

పవన్ కళ్యాణ్ OG, విజయ్ దేవరకొండ VD12 ఇంచుమించు ఒకే టైంలో లేదంటే వారాల గ్యాప్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే వీరి మధ్యలోకి ఇప్పుడు నాచురల్ స్టార్ నాని కూడా వచ్చే ఛాన్స్ ఉందంట. నాని శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ ఫ్రాంచైజ్ లో పార్ట్ 3ని స్టార్ట్ చేయబోతున్నాడు. త్వరలో ఈ మూవీని అఫీషియల్ గా లాంచ్ చేయడంతో పాటు వెంటనే షూటింగ్ కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు.

ఈ మూవీ షూటింగ్ వేగంగా కంప్లీట్ చేసి 2025 మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో ప్రేక్షకుల ముందుకి తీసుకొని రావాలని ప్లాన్ చేస్తున్నారంట. అదే జరిగితే ఈ పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ, నాని ఒకే సారి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడొచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. లేదంటే నెల రోజుల వ్యవధిలో బ్యాక్ టూ బ్యాక్ ఈ ముగ్గురు స్టార్స్ ప్రేక్షకుల ముందుకి తమ సినిమాలతో వచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.