Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ తెలుగు 8.. మాజీ హోస్ట్ తో నాగ్ సర్ ప్రైజ్

ఇప్పుడు మరోసారి నాని, నాగార్జున ఇద్దరూ బిగ్ బాస్ 8వ సీజన్ ప్రారంభం రోజున స్టేజ్‌పై కనిపించబోతున్నారు.

By:  Tupaki Desk   |   31 Aug 2024 5:18 PM GMT
బిగ్ బాస్ తెలుగు 8.. మాజీ హోస్ట్ తో నాగ్ సర్ ప్రైజ్
X

బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో ఆసక్తి కలిగించే రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. షో యొక్క గ్రాండ్ ఓపెనింగ్ ఎపిసోడ్ ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం కానుండగా, హోస్ట్ నాగార్జున ఇప్పటికే కొన్ని ప్రోమోలు విడుదల చేశారు. ఈ సీజన్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇదే శుభవార్త.

ఈసారి బిగ్ బాస్ స్టేజ్‌పై ప్రత్యేకంగా సందడి చేయబోతున్నది ఒక యంగ్ హీరో. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన తన తాజా చిత్రం సరిపోదా శనివారం ప్రమోషన్స్‌లో భాగంగా, నాని బిగ్ బాస్ గ్రాండ్ ఓపెనింగ్ ఎపిసోడ్‌లో గెస్ట్ గా పాల్గొనబోతున్నట్లు సమాచారం. నాని ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 2కి హోస్ట్ గా వ్యవహరించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కూడా నాగార్జున హోస్ట్ చేసిన కొన్ని సీజన్లలో నాని గెస్ట్ గా వచ్చి ప్రేక్షకులను అలరించాడు.

ఇప్పుడు మరోసారి నాని, నాగార్జున ఇద్దరూ బిగ్ బాస్ 8వ సీజన్ ప్రారంభం రోజున స్టేజ్‌పై కనిపించబోతున్నారు. ఈ కాంబినేషన్ చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. నాని ఎంట్రీతో ఈ సీజన్ ప్రారంభం మరింత ఆసక్తికరంగా మారనుంది.

ఇక బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్ గురించి వివిధ ప్రచారాలు నడుస్తున్నాయి. అనేక సీరియల్ నటీనటులు, యాంకర్లు, సోషల్ మీడియా సెలబ్రిటీల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అందులో ముఖ్యంగా కనిపిస్తున్న పేర్లు:

- సీరియల్ నటి రీతూ చౌదరి

- యాంకర్ విష్ణుప్రియ

- ఒక్కప్పటి హీరో ఆదిత్య ఓం

- సీరియల్ నటి యాష్మి గౌడ

- నటుడు నిఖిల్

- యాంకర్ మరియు కమెడియన్ బెజవాడ బేబక్క (సింగర్ మధూ)

- నటుడు అభయ్ నవీన్

- అలీ తమ్ముడు ఖయ్యుమ్

- ఆర్జే శేఖర్ భాష

- నటి సహర్ కృష్ణన్

- ఢీ డ్యాన్సర్ నైనికా

- నటి సోనియా ఆకుల

- జబర్దస్త్ ఫేమ్ యాదమ్మ రాజు

- నటి రేఖ భోజ్

ఈ లిస్ట్‌లో కొంతమంది మాత్రమే షోలో భాగం అవుతారని తెలుస్తుంది. సెలబ్రిటీ కపుల్ కూడా ఈ సీజన్‌లో కనిపించవచ్చని ప్రచారం ఉంది. మరి ఈసారి ఎవరు బిగ్ బాస్ సీజన్ 8కి సెలబ్రిటీగా వచ్చి, స్టార్ డమ్ ను పెంచుకుంటారో చూడాలి.