Begin typing your search above and press return to search.

'ద‌స‌రా' కాంబినేష‌న్ ద‌స‌రా నుంచి మొద‌లా?

తాజాగా సినిమా ప్రారంభోత్స‌వానికి ముహూర్తం పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   7 Oct 2024 9:30 AM GMT
ద‌స‌రా కాంబినేష‌న్ ద‌స‌రా నుంచి మొద‌లా?
X

నేచుర‌ల్ స్టార్ నాని- శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన తొలి చిత్రం 'ద‌స‌రా' ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. ఆ విజ‌యం త‌ర్వాత శ్రీకాంత్ ప‌లువురు హీరోల కోసం ప్ర‌య‌త్నించినా బిజీ షెడ్యూల్ కార‌ణంగా డేట్లు ఇవ్వ‌లేక‌పోయారు. దీంతో మ‌ళ్లీ ఆయ‌న‌కోసం నేచురల్ స్టార్ రంగంలోకి దిగారు. శ్రీకాంత్ తో మ‌రో సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తాజాగా సినిమా ప్రారంభోత్స‌వానికి ముహూర్తం పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

ద‌స‌రా సంద‌ర్భంగా సినిమా లాంచ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌. రెండు..మూడు రోజుల్లో దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలో చాలా విష‌యాలు తెలిసే అవ‌కాశం ఉంది. నాని తో పాటు ఇంకా అందులో న‌టించే న‌టీట‌నులు, ఇత‌ర టెక్నీషియ‌న్ల వివ‌రాలు ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేసే అవ‌కాశం ఉందంటున్నారు.

ద‌స‌రాని మించి ఈ సినిమా క‌థ ఉంటుందని, నాని లుక్ పూర్తిగా కొత్త‌గా ఉంటుంద‌ని...ఇంత‌వ‌ర‌కూ ఇలాంటి పాత్ర ఇండియ‌న్ స్క్రీన్ పై ఏ న‌టుడి పోషించి ఉండ‌ర‌ని మేక‌ర్స్ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. నాని స్టోరీపై అంత కాన్పిడెంట్ గా ఉండ‌టంతోనే ఈ చిత్రాన్ని ఇప్ప‌టికిప్పుడు ప‌ట్టాలెక్కిస్తున్నార‌ని స‌మాచారం. వాస్త‌వానికి 'బ‌లగం' వేణుతో నాని 'ఎల్ల‌మ్మ' అనే సినిమా చేయాలి. నాని ఒకే చెప్పాడు.

కానీ ఎందుక‌నో ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాతే శ్రీకాంత్ ని లైన్ లోకి తెచ్చాడు. ప్ర‌స్తుతం నాని వ‌రుస విజ‌యాల‌తోనూ దూసుకుపోతున్నాడు. ఇప్ప‌టికే వ‌రుస‌గా నాలుగు విజ‌యాల ఖాతాలో ప‌డ్డాయి. `హిట్ -3` తో ఐద‌వ విజ‌యాన్ని న‌మోదు చేయాల‌ని చూస్తున్నాడు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన రెండు భాగాలు భారీ విజ‌యం సాధించాయి. దీంతో మూడ‌వ భాగంపై అంచ‌నాలు స్కైలో ఉన్నాయి. ఇక ఆర‌వ చిత్రంగా శ్రీకాంత్ ఓదెల సినిమా రిలీజ్ అవుతుంది. అది హిట్ అయితే డ‌బుల్ హ్యాట్రిక్ న‌మోదైన‌ట్లే.