Begin typing your search above and press return to search.

గేమ్ చేంజర్‌ కోసం మరో యువ దర్శకుడు?.. చివర్లో ఇలా..

ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

By:  Tupaki Desk   |   19 Nov 2024 11:57 AM GMT
గేమ్ చేంజర్‌ కోసం మరో యువ దర్శకుడు?.. చివర్లో ఇలా..
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పొలిటికల్ డ్రామా గేమ్ చేంజర్ చివరి దశ చిత్రీకరణకు చేరుకుంది. ప్రముఖ దర్శకుడు శంకర్ శన్ముగం తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు మళ్ళీ పెరుగుతున్నాయి. ఇక సినిమా సంక్రాంతికి విడుదలవుతున్న నేపధ్యంలో మేకర్స్ పనులల్లో మరింత వేగం పెంచాడు. చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ ఇదివరకే పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.


ఎస్‌.జే. సూర్య, జయరాం, సముద్రఖని కీలక పాత్రలపై ప్రధానమైన ఎపిసోడ్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ వారాంతంలో షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా ముగించడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. అయితే ఆ మధ్య శంకర్ ఇండియన్ 2 పనుల్లో బిజీగా ఉండడం వలన, కొన్ని షాట్స్ కోసం హిట్‌ 3 దర్శకుడు శైలేష్ కొలనుతో షూట్ చేయించారు. ఇక రీసెంట్ గా సుధీర్ వర్మను రంగంలోకి దించారని తెలుస్తోంది.

అయితే సెట్ లో శంకర్ కూడా ఉన్నారట. పూర్తి స్థాయిలో డైరెక్షన్ కాకుండా సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా మాత్రమే తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయవాడలోని ముఖ్యమైన లొకేషన్లలో చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్ ముగిసిన వెంటనే తిరుపతిలో కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుందని సమాచారం. ఈ షెడ్యూల్ అనుభవం ఉన్న మరో సెకండ్ యూనిట్ డైరెక్టర్ అవసరం అని దిల్ రాజు ప్రత్యేకంగా అతన్ని టీమ్ లో చేర్చినట్లు సమాచారం.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ప్రేక్షకుల అంచనాలను పెంచింది. రామ్ చరణ్ ఇందులో పూర్తిగా కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా, శ్రీకాంత్, ఎస్‌.జే. సూర్య, అంజలి, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాజకీయ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ కథలో భారీ ఎమోషనల్ సన్నివేశాలు, పవర్‌ఫుల్ డైలాగులు ఉండబోతున్నాయి.

ఇక మరోవైపు తమన్ అందిస్తున్న నేపథ్య సంగీతం చిత్రానికి ప్రధాన బలం. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి. ఈ వారంలో మూడో పాట విడుదల కానుందని సమాచారం. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రొడక్షన్ వాల్యూస్‌ అత్యున్నతంగా ఉండబోతున్నాయని మేకర్స్ చెబుతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తి చేయడానికి మేకర్స్ ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్నారు. ఇక గేమ్ ఛేంజర్ 2025 సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రీలీజ్‌కి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.