మేడ మీద బ్యూటీ మళ్లీ ఇటువైపు చూడదా?
కొంత కాలంగా అక్కడే నటిగా కనసాగుతుంది. తమిళ్ లో కూడా బాగానే పని చేస్తోంది.
By: Tupaki Desk | 2 March 2025 8:30 AM GMTకేరళ కుట్టీ నిఖిలా విమల్ సుపరిచితమే. అమ్మడు చైల్డ్ ఆర్టిస్ట్ గానే మాలీవుడ్ లో లాంచ్ అయింది. అటుపై టాలీవుడ్ లో 'మేడ మీద అబ్బాయ్', 'గాయత్రి' లాంటి చిత్రాల్లో నటించింది. కానీ ఈ రెండు సినిమాలు ఆశించిన ఫలితాలు సాధించలేదు. దీంతో మరో ఆలోచన లేకుండా నిఖల మాలీవుడ్ కి వెళ్లిపోయింది. కొంత కాలంగా అక్కడే నటిగా కనసాగుతుంది. తమిళ్ లో కూడా బాగానే పని చేస్తోంది.
ప్రస్తుతం హీరోయిన్ గా రెండు భాషల్లోనూ బిజీగానే ఉంది. గత ఏడాది నాలుగైదు సినిమాలతో అలరిం చింది. ఇదే ఏడాది కూడా నాలుగైదు సినిమాలతో ప్రేక్షకుల్లో ఉండేలా కనిపిస్తుంది. సినిమాలు కూడా మంచి విజయాలు సాధించడంతోనే ఈరకంగా బిజీగా ఉంది. లేకుంటే ఇంత బిజీగా ఉండే ఛాన్స్ లేదు. ఆ రకంగా నిఖిలా విమల్ కెరీర్ సాగిపోతుంది. అయితే ఈ భామ మళ్లీ టాలీవుడ్ వైపు చూడదా? అన్నది సందేహంగా మారింది.
ఎవరికైనా జయపజయాలు సహజం. సక్సెస్ ..పెయిల్యూర్ ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్లాలి. కానీ ఈ విషయంలో టాలీవుడ్ పరంగా చూస్తే నిఖిల ఫెయిల్యూర్ ని బ్యాలెన్స్ చేయలేకపోయింది. రెండు పెయిల్యూర్స్ వచ్చే సరికి మళ్లీ టాలీవుడ్ వైపు చూడటమే మానేసింది. నిజానికి కొంత కాలంగా కేరళ భామలకు టాలీవుడ్ పెద్ద పీట వేస్తుంది. అందులోనూ సక్సెస్ ల్లో ఉన్న భామల్ని నెత్తిన పెట్టుకుంటుంది.
ముంబై భామల్ని పక్కనబెట్టి మరీ కేరళ కుట్టీలను ఎంపిక చేస్తున్నారు. వాళ్లలో నేచురల్ బ్యూటీకి కనెక్ట్ అవ్వడంతో పాటు అంతే సహజంగా నటన ఉండటంతో? వాళ్లే ఉత్తమంగా మేకర్స్ ఎంపిక చేస్తున్నారు. కానీ నిఖిలా విమల్ మాత్రం ఇండస్ట్రీకి పూర్తిగా దూరమై ఎలాంటి కంబ్యాక్ ప్రయత్నాలు చేయకుండా తప్పు చేస్తోంది అన్న వాదన తెరపైకి వస్తోంది.