Begin typing your search above and press return to search.

మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న నితిన్

టాలీవుడ్ టైర్ 2 హీరోలలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ కలిగి ఉన్న నటులలో నితిన్ కూడా ఉంటాడు.

By:  Tupaki Desk   |   31 Dec 2024 12:09 PM GMT
మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న నితిన్
X

టాలీవుడ్ టైర్ 2 హీరోలలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ కలిగి ఉన్న నటులలో నితిన్ కూడా ఉంటాడు. నితిన్ చివరిగా 'మాచర్ల నియోజకవర్గం' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. తరువాత వెంకి కుడుముల దర్శకత్వంలో 'రాబిన్ హుడ్' మూవీతో డిసెంబర్ 20న రావాల్సి ఉంది. అయితే 'పుష్ప 2' ఇంపాక్ట్ ఉంటుందని ఈ చిత్రాన్ని వాయిదా వేశారు.

వెంకి కుడుములు, నితిన్ కాంబినేషన్ లో గతంలో 'భీష్మ' మూవీ వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మరోసారి వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో 'రాబిన్ హుడ్' పైన అంచనాలు ఉన్నాయి. మూవీ నుంచి వచ్చిన టీజర్ కూడా ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది. దీంతో కచ్చితంగా ఈ మూవీతో నితిన్ హిట్ కొడతాడని అందరూ భావించారు.

క్రిస్మస్ ఫెస్టివల్ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన 'పుష్ప 2' బజ్ ఉంటుందని భావించి ఆ చిత్రాన్ని వాయిదా వేశారు. అయితే తెలుగు రాష్ట్రాలలో క్రిస్మస్ వచ్చేసరికి 'పుష్ప 2' కలెక్షన్స్ పూర్తిగా తగ్గిపోయాయి. ప్రేక్షకులు కూడా కొత్త చిత్రాల కోసం వెయిట్ చేశారు. అదే సమయంలో అల్లరి నరేష్ 'బచ్చలమల్లి' మూవీ రిలీజ్ అయ్యింది. అయితే ఈ చిత్రం ఎందుకనో ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకోలేదు.

డబ్బింగ్ మూవీస్ గా వచ్చిన 'విడుదల 2', ఉపేంద్ర 'యూఐ' సినిమాలు తెలుగులో పెద్దగా మెప్పించలేదు. 'రాబిన్ హుడ్' వచ్చి ఉంటే కచ్చితంగా పాజిటివ్ టాక్ తో క్రిస్మస్ వీక్ ని బాగా ఉపయోగించుకునేదనే మాట వినిపిస్తోంది. తన చిత్రాన్ని వాయిదా వేసుకొని నితిన్ మంచి టైం మిస్ చేసుకున్నాడని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ఈ సమయంలో రిలీజ్ అయ్యి ఉంటే కచ్చితంగా నితిన్ ఖాతాలో బ్లాక్ బస్టర్ పడేదనే మాట్లాడుకుంటున్నారు. డిసెంబర్ 20 రిలీజ్ డేట్ వదులుకున్న 'రాబిన్ హుడ్' మేకర్స్ ఫిబ్రవరిలో సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నారు. మరి ఆ సమయం సినిమాకి ఎంత వరకు ప్లస్ అవుతుందనేది వేచి చూడాలి. ఈ సినిమాలో నితిన్ కి జోడీగా శ్రీలీల నటించింది.

అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. దీంతో పాటు నితిన్ దిల్ రాజు బ్యానర్ లో వేణుశ్రీరామ్ దర్శకత్వంలో 'తమ్ముడు' మూవీ చేసాడు. ఈ సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. మార్చి లేదా మే నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది.