Begin typing your search above and press return to search.

ఆదిపురుష్ డైరెక్ట‌ర్ తంతే బూరెల బుట్ట‌లో?

ఈ మూవీ రిలీజ్ అనంత‌రం తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న ఓంరౌత్ అండ‌ర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడంటూ బాలీవుడ్ మీడియాలు ఎగ‌తాళి క‌థ‌నాలు రాసాయి.

By:  Tupaki Desk   |   30 Nov 2024 10:30 PM GMT
ఆదిపురుష్ డైరెక్ట‌ర్ తంతే బూరెల బుట్ట‌లో?
X

'ఆదిపురుష్' లాంటి డిజాస్ట‌ర్ సినిమాని తెర‌కెక్కించాడు ఓంరౌత్. ప్ర‌భాస్ కి అనుకోకుండానే బ్యాడ్ నేమ్ తెచ్చాడు. డార్లింగ్ ప్ర‌భాస్ కెరీర్ లో చెత్త సినిమాగా ఆదిపురుష్ రికార్డుల‌కెక్కింది. ఈ మూవీ రిలీజ్ అనంత‌రం తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న ఓంరౌత్ అండ‌ర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడంటూ బాలీవుడ్ మీడియాలు ఎగ‌తాళి క‌థ‌నాలు రాసాయి.

అయితే ఓంరౌత్ ఈ తీరిక‌ స‌మ‌యంలో ఏం చేస్తున్నాడు? అంటే.. అత‌డు చాలా పెద్ద ప్ర‌ణాళిక‌ల్లో ఉన్నాడ‌ని తెలుస్తోంది. ఓం రౌత్ తదుపరి అజ‌య్ దేవ‌గ‌న్ తో భారీ హిస్టారిక‌ల్ మూవీని ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో హృతిక్ రోషన్ న‌టించాల‌ని దేవ‌గ‌న్ కోరుకుంటున్నారు.

ఓంరౌత్‌తో కలిసి 2020 బ్లాక్ బ‌స్ట‌ర్ 'తానాజీ: ది అన్‌సంగ్ వారియర్‌'లో పనిచేసిన అజయ్ మరో హిస్టారిక‌ల్ సినిమాతో ఫ్రాంచైజీని ముందుకు తీసుకెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నాడు. అతడు ఈ ఫ్రాంఛైజీలో కొత్త సినిమా కోసం ఓంరౌత్ తో క‌లిసి ప‌ని చేస్తున్నాడు. ఇందులో హీరోగా దేవ‌గ‌న్ న‌టిస్తే, హృతిక్‌ను విలన్‌గా ఎంపిక చేయాల‌ని ఆసక్తిగా ఉన్నాడ‌ని తెలుస్తోంది. ప్రాజెక్ట్ ప్ర‌స్తుతం ఇంకా ఆరంభ ద‌శ‌లో ఉంది. ఇంకా సినిమా కథాంశం ఫైన‌ల్ కాలేదు. ఓం రౌత్ దీనిపై ప‌ని చేస్తున్నారు. హృతిక్‌కి అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ - చరిష్మా ఉందని అజయ్ భావిస్తున్నాడు. అతడి న‌ట ప్ర‌తిభ తానాజీ ఫ్రాంఛైజీకి క‌లిసొస్తుంద‌ని దేవ‌గ‌న్ భావిస్తున్నార‌ట‌. తానాజీ: ది అన్‌సంగ్ వారియర్ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించాడు. ఉదయభాన్ సింగ్ రాథోడ్ పాత్రలో తన నటనకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెలుచుకున్నాడు.

దేవ‌గ‌న్- హృతిక్ ప్రాజెక్ట్ అన్‌సంగ్ వారియర్స్ ఫ్రాంచైజీ లో రెండవ భాగంగా ఉంటుంద‌ని స‌మాచారం.

తానాజీ విజయం సాధించినప్పటి నుండి అన్‌సంగ్ వారియర్స్ టైటిల్‌ను ఫ్రాంచైజీగా మార్చడానికి ద‌ర్శ‌క‌హీర్లు ఓం-దేవ‌గ‌న్ వేచి ఉన్నారు. హిస్టారికల్ డ్రామా ఫిల్మ్ సిరీస్ భారతీయ చరిత్రలోని ప‌లువురు రియ‌ల్ హీరోల క‌థ‌ల‌ను తెర‌పైకి తెస్తుంద‌ని తెలిసింది.

ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను రక్షించడానికి 1660లో జరిగిన పవన్ ఖిండ్ యుద్ధంలో తన ప్రాణాలను త్యాగం చేసిన మరాఠా సైన్యానికి చెందిన జనరల్ బాజీ ప్రభు దేశ్‌పాండే క‌థ‌తో సినిమా చేయాలని చిత్ర‌బృందం మొదట ప్లాన్ చేసింది. అయితే 2022లో విడుదలైన మరాఠీ చిత్రం పవన్ ఖింద్ కూడా బాజీ ప్రభు దేశ్‌పాండే జీవిత చరిత్రతో రూపొందించిన‌దే. అదే కథను మరింత పెద్ద స్థాయిలో చెప్పాలా? లేక మరో యుద్ధ వీరుడి చుట్టూ సినిమా సెట్ చేయాలా అనే ఆలోచనలో ఉన్నారు అజయ్- ఓంరౌత్ బృందం. ప్ర‌స్తుతం చర్చలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. బాజీ ప్రభు బయోపిక్‌ను రూపొందించే ఆలోచనను వారు పూర్తిగా విరమించుకోలేదు. ఆ విషయంలో చాలా పరిశోధనలు సాగాయి.. ప్రణాళికలు వేస్తున్నారు! అని తెలుస్తోంది. ఒక‌వేళ హృతిక్ అంగీక‌రిస్తే అజ‌య్- హృతిక్ క‌ల‌యిక‌లో ఇది మొద‌టి ప్ర‌య‌త్నం. హృతిక్ చివరిగా దీపికా పదుకొనేతో కలిసి సిద్ధార్థ్ ఆనంద్ ఫైటర్‌లో కనిపించాడు. అజయ్ 'సింగం ఎగైన్' విజయంతో జోరు పెంచాడు.