ఆ రెండు రిలీజ్ అయిన తర్వాత రిటైర్మెంటేనా?
స్టార్ అయిన తర్వాత రాజకీయాల్లోకి కూడా అనుకోకుండానే వచ్చారు.
By: Tupaki Desk | 15 March 2025 4:00 PM ISTపవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ అతడి ఎంట్రీ అనుకోకుండా జరిగి పోయింది. అనుకోకుండానే పెద్ద స్టార్ అయిపోయారు. సెలబ్రిటీ లైఫ్ ఆస్వాదిస్తాడని ఆయన ఊహకి ఏనాడు రాలేదు. సాధారణ జీవితాన్ని గడపాలనుకున్నారు. కానీ కాలం ఆయన్ని అక్కడితో ఆగి పోనివ్వలేదు. స్టార్ అయిన తర్వాత రాజకీయాల్లోకి కూడా అనుకోకుండానే వచ్చారు.
ప్రజారాజ్యంతో మొదలైన అతడి రాజకీయ ప్రస్థానం జనసేన పార్టీ నిర్మించడం....నేడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నెరవర్తించడం వరకూ వచ్చింది. మరి రాజకీయం? సినిమా? రెండు రంగాల్లో పవన్ ఎక్కువగా ఇష్టపడేది ఏది? అంటే ప్రస్తుతానికి ఆయన మనసంతా రాజకీయంపైనే ఉందన్నది సుస్ఫష్టం. ప్రజలకు సేవ చేయాలని ఆయన తపిస్తోన్న విధానం చూస్తుంటే అర్దమవుతుంది. అయినా సరే తప్పని పరిస్థితుల్లో సినిమాలు చేయాల్సి వస్తోంది.
అది అభిమానుల కోసమా? తన పార్టీ కోసమా? వ్యక్తిగత అవసరాల కోసమా? అన్నది పక్కనబెడితే ఇకపై ఆయన సినిమాలు చేసే అవకాశాలైతే చాలా తక్కువగానే ఉన్నాయని విశ్లేషణలకు తెరపైకి వస్తున్నాయి. కమిట్ అయిన సినిమాలే పూర్తి చేయలేని పరిస్థితి. `ఓజీ`, `హరిహర వీరమల్లు` సంవత్సరాలుగా సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.
మరి ఇలాంటి పరిణామాల్లో పవన్ కొత్త సినిమాలు చేసే అవకాశం ఎంత మాత్రం ఉండదని ...రానున్న రోజుల్లో ఆయన రాజకీయంగా మరింత బిజీ అవుతారని అంటున్నారు. పైగా వచ్చే ఎన్నికల్లో పవన్ ఎలాంటి మద్దతు లేకుండా బరిలోకి దిగాలంటే పార్టీని ఇప్పటి నుంచే మరింత బలోపేతం చేయాలి. అలా చేయగ లిగితేనే రాజకీయంగా భవిష్యత్. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పవన్ ఓజీ, వీరమల్లు తర్వాత కొత్త సినిమాలేవి చేసే అవకాశం లేదంటున్నారు.