గోల్డెన్ గ్లోబ్ కొట్టేలా సంచలనమవ్వాల్సిన సమయం!
ఈ అవార్డుకు నామినేట్ అయిన భారతీయ చిత్రాలు అతి తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి.
By: Tupaki Desk | 29 Dec 2024 1:30 AM GMTపాయల్ కపాడియా రూపొందించిన 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' ఇప్పటికే పలు అవార్డుల..రివార్డులు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆసియా పసిఫిక్ స్క్రీన్ పురస్కారాల్లో ఐదు నామినేన్లు దక్కించుకోగా, కేన్స్ చలన చిత్రోత్సవాల్లో గ్రాండ్ పిక్స్ ను కైవసం చేసుకుంది. ఈ ఘనతను సాధించిన తొలి భారతీయ చిత్రం ఇదే. ఈ అవార్డుకు నామినేట్ అయిన భారతీయ చిత్రాలు అతి తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక 82వ గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలకు రెండు విభాగాల్లో నామినేట్ అయిన సంగతి తెలిసిందే. బెస్ట్ నాన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్- బెస్ట్ డైరెక్టర్ కేటగిరీల్లో ఈ భారతీయ చిత్రం హాలీవుడ్ సినిమాలతో పోటీ పడుతోంది. దీంతో రెండు విభాగాల్లోనూ అవార్డులు దక్కించుకుంటుందా? లేదా? అన్న ఉత్కంట మొదలైంది. వచ్చే వారమే విజేతలు ఎవరు? అన్నది తేలిపోయింది. జనవరి 5న అవార్డులు కార్యక్రమం ఉంటుంది.
ఈ నేపథ్యంలో? సినిమా ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. జనవరి 3న డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ అవుతుంది. అంటే? గోల్డోన్ గ్లోబ్ ప్రదానోత్సవానికి రెండు రోజులు ముందు ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ నేపథ్యంలో సినిమా వరల్డ్ వైడ్ సంచలనం అవ్వాల్సిన అవసరం అంతే ఉంది. థియేట్రికల్ రిలీజ్ లో సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓటీటీ రిలీజ్ అంటే? వరల్డ్ అంతా చూస్తుంది. గోల్డెన్ గ్లోబ్ ముందు ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటే? అవార్డుకు దొహద పడుతుంది.
గతంలో 'ఆర్ ఆర్ ఆర్' చిత్రంలోని నాటు నాటు పాటకు కూడా గోల్డెన్ గ్లోబ్ వరించిన సంగతి తెలిసిందే. ఆస్కార్ అవార్డు ముందు ఇదో శుభ సూచికంగా సంచలనమైంది. తాజాగా భారత్ నుంచి మరో సినిమా గోల్డెన్ గ్లోబ్ కి నామినేట్ అయిన నేపథ్యంలో ఓటీటీలోనూ సినిమా సక్సెస్ అంతే కీలకం. దీనికి సంబంధించి మేకర్స్ ఇప్పటికే ప్రచారం పనులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.