Begin typing your search above and press return to search.

పూజ.. మరో 'లక్కీ' ఛాన్స్ కొట్టినట్లు ఉందే!

స్టార్ హీరోయిన్ రేంజ్‌ కు ఎదిగిపోయింది. కానీ కొంతకాలంగా వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్న ఆమె.. సరైన హిట్ కోసం వెయిట్ చేస్తోంది.

By:  Tupaki Desk   |   1 Feb 2025 4:30 PM GMT
పూజ.. మరో లక్కీ ఛాన్స్ కొట్టినట్లు ఉందే!
X

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డేకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఒక లైలా కోసం మూవీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన పూజ.. తక్కువ టైమ్ లోనే ఇండస్ట్రీలో ఫుల్ పాపులర్ అయిపోయింది. స్టార్ హీరోయిన్ రేంజ్‌ కు ఎదిగిపోయింది. కానీ కొంతకాలంగా వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్న ఆమె.. సరైన హిట్ కోసం వెయిట్ చేస్తోంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రాధే శ్యామ్, దళపతి విజయ్ తో బీస్ట్, చిరంజీవితో ఆచార్య సినిమాలు చేసి వరుసగా ఫ్లాపులు అందుకుంది పూజ. ఆ తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లి రణవీర్ సింగ్ తో సర్కస్, సల్మాన్ ఖాన్ తో కిసీ కా భాయ్ కిసీ కి జాన్ మూవీస్ చేసినా.. అక్కడ కూడా సరైన హిట్ ను సంపాదించుకోలేకపోయింది.

దీంతో ఐదు ఫ్లాప్స్ ఆమె ఖాతాలో చేరాయి. అలా వరుస డిజాస్టర్స్ తో సతమతమైన అయిన పూజ.. ఇప్పుడు మళ్లీ కమ్ బ్యాక్ ఇవ్వాలని ట్రై చేస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో సూర్య రెట్రో మూవీలో యాక్ట్ చేస్తున్న అమ్మడు.. దళపతి విజయ్ చివర సినిమా అయిన జన నాయగన్ లో లీడ్ రోల్ లో కనిపించనుంది.

రెట్రో, జన నాయగన్‌తోపాటు బాలీవుడ్ లో షాహిద్ కపూర్‌ తో దేవ, వరుణ్ ధావన్‌తో హై జవానీ తో ఇష్క్ హోనా హై సినిమాలు చేస్తోంది. అదే సమయంలో పూజ ఇప్పుడు మరో లక్కీ ఛాన్స్ అందుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో జత కట్టనున్నట్లు ఇప్పుడు జోరుగా ప్రచారం సాగుతోంది.

అయితే తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు దుల్కర్ సల్మాన్. రీసెంట్ గా లక్కీ భాస్కర్ తో మంచి హిట్ అందుకున్నారు. ప్రస్తుతం కాంత, ఆకాశంలో ఒక తార చిత్రాలు చేస్తున్నారు. అదే సమయంలో రవి అనే కొత్త దర్శకుడితో వర్క్ చేయనున్నట్లు ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

ఎస్‌.ఎల్‌.వి సినిమాస్‌ సంస్థ ఆ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం. ఆ మూవీలోనే ఇప్పుడు పూజ హీరోయిన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెకు మరో లక్కీ ఛాన్స్ దక్కిందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వనున్నట్లు వినికిడి. మరి వరుస చిత్రాలతో టాలీవుడ్ బుట్ట బొమ్మ ఎలాంటి విజయాలు సాధిస్తుందో వేచి చూడాలి.