Begin typing your search above and press return to search.

ఇండ‌స్ట్రీలో కంబ్యాక్ రాజా కంబ్యాక్ అయ్యేదెప్పుడు!

ఇండ‌స్ట్రీకి వార‌సుల్ని ప‌రిచ‌యం చేయ‌డం...భారీ విజ‌యాలు అందించిన ఘ‌త‌న ఆయ‌న సొంతం.

By:  Tupaki Desk   |   23 Dec 2024 11:30 AM GMT
ఇండ‌స్ట్రీలో కంబ్యాక్ రాజా కంబ్యాక్ అయ్యేదెప్పుడు!
X

డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ స‌క్సెస్ లు గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇండ‌స్ట్రీకి వార‌సుల్ని ప‌రిచ‌యం చేయ‌డం...భారీ విజ‌యాలు అందించిన ఘ‌త‌న ఆయ‌న సొంతం. డిస్ట్రిబ్యూట‌ర్లు అత‌డి బ్రాండ్ తోనే సినిమాలు కొనేసేవారు. ఆయ‌న సినిమాల్లో హీరోతో ప‌నిలేదు. ఆయ‌న క‌థే హీరో. అయితే ఇదంతా ఒక‌ప్పుడు. కొంత కాలంగా పూరి సినిమాలు స‌రిగ్గా ఆడ‌టం లేదు. 'టెంప‌ర్' త‌ర్వాత 'ఇస్మార్ట్ శంక‌ర్' తో కంబ్యాక్ అయ్యారు. మ‌ధ్య‌లో చేసిన సినిమాన్నీ ప్లాప్ అయిన‌వే.

ఆ త‌ర్వాత చేసిన 'లైగ‌ర్', 'డ‌బుల్ ఇస్మార్ట్' కూడా వైఫ‌ల్యం చెందాయి. ప్ర‌స్తుతం పూరి ఏ హీరోతో సినిమా చేస్తున్నాడు? అంటే చెప్ప‌లేని ప‌రిస్థితి. ఒక‌ప్పుడు ఒక సినిమా సెట్స్ లో ఉండ‌గానే రెండు, మూడు ప్రాజెక్ట్ లు రెడీగా ఉండేవి. ఆయ‌న కోసం స్టార్ హీరోలో ఉండేవారు. కానీ ఇప్పుడా స‌న్నివేశం ఎక్క‌డా క‌నిపించ‌లేదు. నిర్మాత‌లంతా ఫాంలో ఉన్న డైరెక్ట‌ర్ల‌తోనే సినిమాలు చేస్తున్నారు. హీరోలంతా హిట్లు ఉన్న ద‌ర్శ‌కుల‌తోనే ముందుకెళ్తున్నారు.

అయితే పూరికి ప‌డ‌టం లేవ‌టం ఇండ‌స్ట్రీలో బాగా అల‌వాటైన ప‌ని. న‌మ్మిన వ్య‌క్తి 100 కోట్లు తినేసినా ప‌ల్తెత్తు మాట అనుకుండా? మ‌ళ్లీ ఆ వంద కోట్లు సంపాదించి కంబ్యాక్ అయ్యాడు. ప్లాప్ ల త‌ర్వాత విజ‌యాల‌తోనూ అలాగే కంబ్యాక్ అయ్యాడు. తాజాగా పూరి గురించి ఇదే ధీమాని ఇండ‌స్ట్రీ లో కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు. పూరి విజ‌న్, క్లారిటీ గురించి చెప్పుకొస్తూ మ‌ళ్లీ ఆయ‌న లేస్తాడు గొప్ప కంబ్యాక్ అవుతాడ‌ని ఆశా భావం వ్య‌క్తం చేస్తున్నారు.

పూరిని ద‌గ్గ‌ర చూసిన వాళ్లు, ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేసిన వారు, స‌న్నిహితుల‌, స్నేహితులు అంతా పూరి కంబ్యాక్ గురించి ఎదురు చూస్తున్న‌ట్లు చెబుతున్నారు. అయితే పూరి వ‌య‌సు ఇప్పుడి 58. మ‌రి ఆ వ‌య‌సిప్పుడు స‌హ కరిస్తుందా? అన్న‌ది చూడాలి. 'డ‌బుల్ ఇస్మార్ట్' చేస్తోన్న స‌మ‌యంలో ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని ప‌నిచేస్తున్నాను చెప్పారు. క‌థ‌కి సంబంధించి గ్రేట్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ స‌ల‌హా కూడా తీసుకున్నారు. కానీ ఆ సినిమా ప్లాప్ అయిన సంగ‌తి తెలిసిందే.