Begin typing your search above and press return to search.

దెయ్యం రికార్డులను పుష్ప రాజ్ కొట్టగలడా?

అయితే స్త్రీ2 మూవీ కలెక్షన్స్ రికార్డ్స్ ని నార్త్ ఇండియాలో ఇప్పట్లో ఏ సినిమా అయిన బ్రేక్ చేస్తుందా అంటే పుష్ప 2 వైపు అందరూ చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   12 Sep 2024 3:50 AM GMT
దెయ్యం రికార్డులను పుష్ప రాజ్ కొట్టగలడా?
X

హిందీ ఇండస్ట్రీలో ఈ స్త్రీ2 మూవీ సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. గత నెల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ దెయ్యం మూవీ మొదటి రోజే అద్భుతమైన కలెక్షన్స్ తో తన రన్ స్టార్ట్ చేసింది. ఈ ఏడాదిలో హిందీ పరిశ్రమ నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రేక్షకులని ఎంగేజ్ చేసే సినిమాలు రాలేదు. ప్రేక్షకుల ఎదురుచూపులాకి స్త్రీ2 మూవీ పెద్ద ఊరట ఇచ్చింది. దీంతో స్త్రీ2 మూవీని నార్త్ ఇండియన్ ఆడియన్స్ విపరీతంగా ఆదరించారు. హర్రర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమాకి ఓ విధంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారని చెప్పొచ్చు.

దీంతో థియేటర్స్ లో లాంగ్ రన్ టైంని సొంతం చేసుకుంది. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 780+ కోట్లకి పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో అత్యధిక ప్రాఫిట్ తీసుకొచ్చిన సినిమాల జాబితాలో స్త్రీ2 మూవీ టాప్ లో ఉంది. అలాగే హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో స్త్రీ2 టాప్ 7లో ఉంది. దీనిని బట్టి ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఏ స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకుందో అర్ధం చేసుకోవచ్చు.

ఇక నార్త్ ఇండియా మార్కెట్ లో స్త్రీ మూవీ ఏకంగా 585 కోట్ల వరకు కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. హిందీ బెల్ట్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ మొన్నటి వరకు బాహుబలి 2 పేరు మీద ఉండేది. ఆ కలెక్షన్స్ ని స్త్రీ2 బ్రేక్ చేసింది. లాంగ్ రన్ లో 600 కోట్ల మార్క్ ని స్త్రీ2 మూవీ నార్త్ ఇండియాలో అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే స్త్రీ2 మూవీ కలెక్షన్స్ రికార్డ్స్ ని నార్త్ ఇండియాలో ఇప్పట్లో ఏ సినిమా అయిన బ్రేక్ చేస్తుందా అంటే పుష్ప 2 వైపు అందరూ చూస్తున్నారు.

పుష్ప2 సినిమాపై హిందీలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. పుష్ప 1 మూవీ హిందీలో సూపర్ సక్సెస్ అయ్యింది. 100 కోట్లకి పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. అందుకే పుష్ప 2 పైన నార్త్ ఇండియాలో హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. డిసెంబర్ 6న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. కచ్చితంగా స్త్రీ2 మూవీ హిందీ బెల్ట్ కలెక్షన్స్ రికార్డ్ ని పుష్ప 2 బ్రేక్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

మూవీపై ఉన్న హైప్ ని ట్రైలర్ తో మరింత పెంచగలిగితే భారీ ఓపెనింగ్స్ ని పుష్ప2 అందుకునే అవకాశం ఉంది. అలాగే సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కచ్చితంగా నార్త్ ఇండియాలో పుష్ప 2 మూవీ లాంగ్ రన్ ని సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. ముఖ్యంగా హిందీలో బి,సి సెంటర్ ఆడియన్స్ పుష్ప 2ని ఎక్కువగా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారని భావిస్తున్నారు. మరి స్త్రీ2 సినిమా కలెక్షన్స్ రికార్డ్ ని పుష్ప 2 ఏ మేరకు అందుకుంటుంది అనేది తెలియాలంటే డిసెంబర్ వరకు వేచి చూడాల్సిందే.