'పుష్ప-2' మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయితే రచ్చ రచ్చే!
తాజాగా 'చావా' కంటే ఒక్కరోజు ముందుగానే 'పుష్ప-2' రిలీజ్ అవుతుందనే వార్త మరింత కాక పుట్టిస్తుంది.
By: Tupaki Desk | 11 Oct 2024 5:02 AM GMTభారీ అంచనాల మధ్య 'పుష్ప-2' పాన్ ఇండియాలో డిసెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సహా జరిగిన బిజినెస్ చూస్తే అంచనాలు పీక్స్ కి చేరాయి. దీంతో 'పుష్ప-2' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందనే అంచనాలు అంతకంతకు రెట్టింపు అవుతున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండానే 400 కోట్లకు పైగా రాబట్టింది. ఇంక అంచనాలతో వస్తే ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి? హిట్ టాక్ తెచ్చుకుంటే ఫుల్ రన్ లో రణరంగం ఎలా ఉంటుంది? అనేది ప్రేక్షకాభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
తాజాగా 'చావా' కంటే ఒక్కరోజు ముందుగానే 'పుష్ప-2' రిలీజ్ అవుతుందనే వార్త మరింత కాక పుట్టిస్తుంది. రెండు సినిమాలు డిసెంబర్ 6న రిలీజ్ అయితే నార్త్ లో కొంత ప్రభావం 'పుష్ప-2' పై ఉంటుంది అన్నది వాస్తవం. ఓపెనింగ్స్ పరంగా అనుకున్న స్థాయిలో ఉండే అవకాశం ఉండదు. అందుకే ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఓపెనింగ్స్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఆ తర్వాత టాక్ ను బట్టి జనాలు థియేటర్ కి వెళ్తారు. ఆ మరుసటి రోజు 'చావా' రిలీజ్ అవుతుంది. ఆసినిమా ఓపెనింగ్ కి ఇబ్బంది ఉండదు. 'పుష్ప -2' మేకర్స్ ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు వినిపిస్తుంది. అయితే ఇంతవరకూ అధికారిక సమాచారం లేదు. నిర్మాతలు క్లారిటీ ఇస్తే తప్ప సంగతేంటి? అన్నది తెలియదు. అయితే ఈప్రపోజల్ ఇప్పటికే నార్త్ పంపిణీ దారులు నిర్మాతల దృష్టికి తీసుకెళ్లినట్లు వాళ్లు కూడా ఆలోచన పడటంతో? విషయం ఇలా బయటకు పొక్కిందని లీకులందుతున్నాయి.
ఇదే నెలలో రిలీజ్ అవ్వాల్సిన 'గేమ్ ఛేంజర్' కూడా వాయిదా పడుతున్నట్లు ప్రచారంలో ఉంది. అది కూడా జరిగితే 'పుష్ప2' కి కలిసొచ్చినట్లే. ఒకే వరలో రెండు ఇమడడం కష్టం కాబట్టి! పోటీ లేకుండా రావడం అన్నది ఎంతో ఉత్తమమైనది. 'పుష్ప-2' హిట్ టాక్ తెచ్చుకుంటే వసూళ్లు సునామీ కొనసాగిస్తుంది.