Begin typing your search above and press return to search.

మ‌హేష్‌-రాజ‌మౌళి సినిమా 2027లోనా?

ఈ ప‌నుల‌న్నీ ముగించుకుని జ‌న‌వ‌రి లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   25 Oct 2024 11:30 AM GMT
మ‌హేష్‌-రాజ‌మౌళి సినిమా 2027లోనా?
X

ఎస్ ఎస్ ఎంబీ 29 రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియాలో సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే స్క్రిప్ట్ ప‌నులు ముగించుకుని ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో టీమ్ నిమ‌గ్న‌మైంది. అవ‌స‌ర‌మైన ట్రైనింగ్ ల‌ను మ‌హేష్ పూర్తి చేస్తున్నారు. ఈ ప‌నుల‌న్నీ ముగించుకుని జ‌న‌వ‌రి లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉంది. మ‌రి సినిమా రిలీజ్ ఎప్పుడు? అంటే ఇంత‌వ‌ర‌కూ ఆ ప్ర‌స్తావ‌నే ఎక్క‌డా రాలేదు.

రాజ‌మౌళి సినిమా అంటే ఎలాగూ ఆల‌స్యం అవుతుంద‌ని రిలీజ్ సంగ‌తిని తాత్కాలికంగా లైట్ తీసుకున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా రిలీజ్ విష‌యం చిత్ర వ‌ర్గాల నుంచి లీకైంది. ఈ చిత్రాన్ని 2027 మిడ్ లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌. అంటే రెండున్న‌రేళ్ల పాటు రాజ‌మౌళి ఈ చిత్రంపైనే ఉండ‌నున్నారు అన్న మాట‌. షూటింగ్ స‌హా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొత్తం పూర్త‌వ్వ‌డానికి చేయ‌డాకి ఇంత స‌మ‌యం తీసుకుంటున్నారు.

గ‌తంలో ఆయ‌న తెర‌కెక్కించిన `బాహుబ‌లి`, `ఆర్ ఆర్ ఆర్` లాంటి సినిమాల‌కు ఇలాగే స‌మ‌యం ప‌ట్టింది. తొలుత డేట్ ప్ర‌క‌టించినా ఆ త‌ర్వాత షూటింగ్ స‌హా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ డిలే అవ్వ‌డంతో ఆ త‌ర్వాత రిలీజ్ వాయిదా ప‌డింది. కాబ‌ట్టి మ‌హేష్ సినిమా అదే ఏడాదిలో రిలీజ్ అవుతుందా? అన్న‌ది ఇప్పుడే క్లారిటీ గా చెప్పే ప‌రిస్థితి ఉండ‌దు. షూట్ కివెళ్లిన త‌ర్వాత అక్క‌డ ప్ర‌ణాళిక‌ను బ‌ట్టి రిలీజ్ తేదీ అన్న‌ది ఆధార ప‌డి ఉంటుంది.

ప్ర‌స్తుతానికి లీకైన ఏడాది కేవ‌లం అంచ‌నాగానే ప‌రిగ‌ణించాల్సి ఉంటుంది. ఈ చిత్రాన్ని రాజ‌మౌళి అంత‌ర్జాతీయ ప్రాజెక్ట్ గానూ మ‌లిచే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి ఆ రీచ్ ఇవ్వ‌డానికి జ‌క్క‌న్న చాలా ప్ర‌య‌త్నాలు చేస్తారు. రిలీజ్ కి ముందే ఇంట‌ర్నేష‌న‌ల్ గా సినిమాని ప్ర‌చారం చేస్తాడు. అవ‌స‌ర‌మైన అంత‌ర్జాతీయ అన్ని లోకేష‌న్ల‌లోనూ షూటింగ్ చేస్తారు. ఆప్రిక‌న్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ స్టోరీ కావ‌డంతో అమెజాన్ అడ‌వుల్లోనూ ఈ సినిమా షూటింగ్ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.