రాజమౌళి వేగం పెంచాలి లేకపోతే పరిస్థితి వాళ్లలాగే!
ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టాడు? అంటే రిలీజ్ అవ్వడానికి రెండు..మూడు సంవత్సరాలైనా పడుతుంది.
By: Tupaki Desk | 8 March 2025 5:00 AM ISTస్టార్ డైరెక్టర్ రాజమౌళితో పనిచేయాలని టాలీవుడ్ , బాలీవుడ్, కోలీవుడ్ , మాలీవుడ్ ఇలా అన్ని భాషల స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ప్రస్తుతం కేవలం తెలుగు హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు. మాతృ భాష పై మమకారంతో తన సత్తా ఏంటి? అన్నది ప్రపంచానికి టాలీవుడ్ నుంచే చాటుతున్నారు. ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టాడు? అంటే రిలీజ్ అవ్వడానికి రెండు..మూడు సంవత్సరాలైనా పడుతుంది.
అందులోనూ భాగాలు గా చేసి సినిమా తీస్తేగనుక అదే ప్రాంచైజీ మొత్తం పూర్తవ్వడానికి నాలుగైదేళ్లు అయినా పడుతుంది. 'బాహుబలి' మొదటి భాగం 2015 లో రిలీజ్ అయితే...రెండవ భాగం 2017లో రిలీజ్ అయింది. ఆ తర్వాత 'ఆర్ ఆర్ ఆర్' సినిమా కథ రాసి...పూర్తిచేసి రిలీజ్ చేయడానికి ఏకంగా ఐదేళ్లు పట్టింది. ఇలా సినిమాలు చేసి ఇండస్ట్రీకి మంచి విజయాలు అందించడం బాగానే ఉంది.
కానీ ఇదే విధంగా కొనసాగితే కెరీర్ మొత్తంలో రాజమౌళి ఎన్నో సినిమాలు చేయలేరన్న వాదన తెరపైకి వస్తుంది. మిగతా స్టార్ హీరోలకు అన్యాయం జరుగుతుందనే అంశం తెరపైకి వస్తోంది. సినిమాల నుంచి రిటైర అయ్యేలోపు ఒక్క సినిమా అయినా జక్కన్నతో చేయాలని మరోంతో మంది కలలు కంటున్నారు. మరి ఇది జరుగుతుందా? లేదా? అన్నది కాలమే నిర్ణయించాలి.
ప్రస్తుతం రాజమౌళి వయసు 51 ఏళ్లు. సినిమా రంగంలో ఎవరెంత కాలం పని చేస్తారు? అన్నది చెప్పలేం. పైగా క్రియేటివ్ రంగంలో వయసు మీద పడే కొద్ది క్రియేటివ్ థాట్స్ తగ్గిపోతాయి. క్రియేటివ్ పరంగా మైండ్లో రకరకాల డైవర్షు మొదలవుతాయి. దీంతో కన్ ప్యూజన్ తప్పదు. సహనంగా పనిచేసే ఆసక్తి తగ్గుతుంది. ఆన్ సెట్స్ లో ఉత్సాహం సన్నగిల్లుతుంది. చేసిన పనే మళ్లీ చేయాలంటే? బోరింగ్ అనే భావన ఒకానొక స్టేజ్ లో ఉద్భవిస్తుంది.
రాజ్ కుమార్ హిరాణీ, సంజయ్ లీలా భన్సాలీ లాంటి వాళ్లు ఎక్కువ సినిమాలు చేయలేకపోవడానికి కారణాలు పై విధంగానే ఉంటాయని పలు సందర్భాల్లో వ్యక్తం చేసారు. రెండు దశబ్ధాల కెరీర్ లో రాజ్ కుమార్ హిరాణీ డైరెక్టర్ గా ఆరేడు సినిమాలే చేసారు. మూడు దశాబ్ధాల కెరీర్ లో సంజయ్ లీలా భన్సాలీ కూడా 10-12 సినిమాలే చేసారు. వీళ్లిద్దరితో పోలిస్తే రాజమౌళి ఎక్కువ సినిమాలే చేసారు.
కెరీర్ ఆరంభంలో వేగంగా సినిమాలు చేసి `బాహుబలి` నుంచి స్పీడ్ పూర్తిగా తగ్గించేసారు. ఇందుకు వయో భారం కూడా ఓకారణమా? అన్నది సందేహమే. మహేష్ తో సినిమా కూడా రెండేళ్లు పడుతుంది. దీన్ని రెండు భాగాలుగా చేస్తే గనుక ఐదారేళ్లు అయిన పట్టే అవకాశం ఉంటుంది. మధ్యలో మరో సినిమా చేసే అవకాశం ఉంటుంది. అంటే అప్పటకి జక్కన్న 60కి చేరువ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కాబట్టి జక్కన్న వేగం పెంచి సినిమాలు చేస్తే అందరి హీరోలతోనూ పని చేసిన అనుభూతి సాధ్యమతుంది. లేదంటే? వాళ్ల ఆశ నీరు గారి పోతుంది? పని చేయలేకపోయాం? అన్న భావన జక్కన్న ను రిటైర్మెంట్ అనంతరం తొలి చేస్తుంది.