ఖాన్‌ల త్రయానికి పోటీగా రణబీర్?
1000 కోట్ల క్లబ్ అనగానే అమీర్ ఖాన్ దంగల్, షారూఖ్ పఠాన్- జవాన్ గుర్తుకు వస్తాయి.
By: Tupaki Desk | 10 Sep 2024 8:30 PM GMT100 కోట్ల క్లబ్.. 500 కోట్ల క్లబ్ .. 1000 కోట్ల క్లబ్ .. ఇటీవల భారతీయ సినిమాకి 500 కోట్ల నుంచి 1000 కోట్ల మధ్యలో వసూళ్లు సాధ్యమవుతున్నాయి. తెలుగు, కన్నడం, హిందీ చిత్రసీమలు ఈ ఫీట్ ని సాధించాయి. బాలీవుడ్ లో ఖాన్ ల త్రయంలో సల్మాన్ మినహా మిగతా ఇద్దరూ వీటిని అందుకున్నారు. 1000 కోట్ల క్లబ్ అనగానే అమీర్ ఖాన్ దంగల్, షారూఖ్ పఠాన్- జవాన్ గుర్తుకు వస్తాయి.
అయితే ఖాన్‌ల నుంచి మునుముందు ఇదే తరహా విజయాలు సాధ్యమేనా? అన్న చర్చా వేడెక్కిస్తోంది. ప్రస్తుత సన్నివేశం చూస్తుంటే, 500 కోట్లు అంతకుమించి వసూళ్లను సాధించే క్లబ్ లలో ఖాన్ లు ఉన్నారు. అమీర్ తదుపరి తారే జమీన్ పార్ సహా సోలో హీరోగా నటించే ప్రాజెక్టుపై దృష్టి సారించాడు. మరోవైపు షారూఖ్ ఖాన్ కింగ్ సహా పఠాన్ 2 పై పూర్తిగా దృష్టి పెట్టాడు. సల్మాన్ ఖాన్ ఆశలన్నీ మురుగదాస్ `సికందర్` పై ఉన్నాయి. ఇదే సమయంలో రణబీర్ యానిమల్ 2 తో తిరిగి భారీ విజయాన్ని నమోదు చేస్తాడని అంచనా. పఠాన్ 2, సికందర్ చిత్రాలకు భారీ వసూళ్లను సాధించే ఆస్కారం చాలా ఎక్కువ. అదే సమయంలో యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ గా రానున్న యానిమల్ పార్క్ కూడా వెయ్యి కోట్ల క్లబ్ ని అందుకునేందుకు ఆస్కారం ఉందని అంచనా.
అదంతా అటుంచితే... ఖాన్ ల త్రయానికి సందీప్ వంగా అతి పెద్ద పోటీ. అతడు తెరకెక్కించే యానిమల్ పార్క్ పై హైప్ చాలా ఎక్కువగా ఉంటుంది. రణబీర్ కపూర్ తన కెరీర్ బెస్ట్ ని మరోసారి అందుకుంటాడని నమ్ముతున్నారు. సల్మాన్ ఖాన్ కానీ, రణబీర్ కానీ నటించిన సినిమాలేవీ ఇంకా 1000 కోట్ల క్లబ్ లో చేరలేదు. ఆ ఇద్దరూ మునుముందు ఈ ఫీట్ ని అందుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు. ఖాన్‌ల త్రయానికి పోటీగా కపూర్‌ని సందీప్ వంగా నిలబెడతాడతాడని మెజారిటీ వర్గం భావిస్తోంది.