Begin typing your search above and press return to search.

RGV బడా ప్రాజెక్టులో ఇద్దరు ఫిక్స్.. అసలు ప్లాన్ ఏంటంటే..

2018లో నాగార్జునతో చేసిన ఆఫీసర్ సినిమా రామ్ గోపాల్ వర్మకి మళ్లీ గుర్తింపు తీసుకువస్తుంది అని అందరూ అనుకున్నా, అది ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.

By:  Tupaki Desk   |   29 Jan 2025 1:57 PM
RGV బడా ప్రాజెక్టులో ఇద్దరు ఫిక్స్.. అసలు ప్లాన్ ఏంటంటే..
X

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు విభిన్నమైన కథలు, ట్రెండ్ సెట్టింగ్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తిరిగి ఫామ్‌లోకి రావడానికి సిద్ధమవుతున్నాడు. గత కొంతకాలంగా ఆయన దర్శకత్వంలో చెప్పుకోదగ్గ హిట్ రాలేదు. 2018లో నాగార్జునతో చేసిన ఆఫీసర్ సినిమా రామ్ గోపాల్ వర్మకి మళ్లీ గుర్తింపు తీసుకువస్తుంది అని అందరూ అనుకున్నా, అది ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.

అయితే ఇప్పుడు వర్మ తన మునుపటి ఫామ్‌ను తిరిగి పొందేందుకు పెద్ద స్థాయి పాన్ ఇండియా ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుండడం విశేషం. వర్మ తన దృష్టిని ఇప్పుడు పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కథలపై పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, మలయాళ సూపర్ టాలెంట్ ఫహద్ ఫాజిల్ లాంటి స్టార్ నటీనటులను లైన్‌లో పెట్టాడు.

ఇండస్ట్రీలోని టాప్ యాక్టర్స్‌ని ఒకే ప్రాజెక్ట్‌లోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌తో వర్మ తన పాత శక్తిని తిరిగి ప్రదర్శించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇంకా పూర్తిస్థాయి నటీ నటుల వివరాలు వెల్లడి కాలేదు. కానీ వర్మ తనదైన మార్క్ ఉన్న కథను, నటన పరంగా హై రేంజ్ మేకింగ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.

వర్మ అసలు ప్లాన్ ఏమిటంటే.. ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుండడంతో, ప్రతి పరిశ్రమ నుంచి ఒక స్టార్ యాక్టర్‌ను ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ నుంచి ప్రముఖ నటీనటులను తీసుకుని సినిమా రేంజ్‌ను మరింత పెంచాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. వర్మ ఫామ్ లో లేకపోయినా అతని టాలెంట్ ను నమ్మి ఒప్పుకునే స్టార్స్ సంఖ్య ఎక్కువగానే ఉంది.

ఇక వర్మ న్యూ ప్రాజెక్ట్ కథపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే వర్మ గతంలో చేసిన గ్యాంగ్‌స్టర్ డ్రామాల తరహాలో కాకుండా, పూర్తి స్థాయిలో కొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నాడని టాక్. ముఖ్యంగా, ఆయన ఈ ప్రాజెక్ట్‌తో తన ఫ్లాప్స్‌ను కవర్ చేసి, మళ్లీ హిట్ డైరెక్టర్‌గా నిలవాలనే పట్టుదలతో ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. వర్మ గతంలో చేసిన కొన్ని సినిమాలు మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ఆ స్థాయిని నిలుపుకోవడంలో విఫలమయ్యాడు. కానీ ఈసారి మైత్రీ మూవీ మేకర్స్ వంటి ప్రముఖ బ్యానర్‌తో కలసి పనిచేస్తుండటంతో, ఈ సినిమాకు అన్ని వర్గాల్లో మంచి ప్రచారం లభించే అవకాశం ఉంది.