కంటెంట్ ఉన్న భామలకి కటౌట్ తో పనేముంది?
సరిగ్గా వాళ్లిద్దరి తరహాలోనే రష్మిక మందన్నా, సాయి పల్లవి కూడా చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు.
By: Tupaki Desk | 1 Feb 2025 4:00 AM GMTఇండస్ట్రీలో నటిగా రాణించడం అంత ఈజీ కాదు. అందులోనూ లాంగ్ కెరీర్ ని కొనసాగించడం అన్నది అసలే సులభం కాదు. ప్రతిభతో పాటు అదృష్టం కూడా కలిసొస్తేనే ఇది సాధ్యమవుతుంది? అన్నది సక్సెస్ అయిన వాళ్ల మాట. ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వెళ్లిన ఐశ్వర్యా రాయ్, దీపికా పదుకొణే లాంటి ఉత్తమ నాయికలు చెప్పిన మాటలవి. సరిగ్గా వాళ్లిద్దరి తరహాలోనే రష్మిక మందన్నా, సాయి పల్లవి కూడా చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు.
ఐష్, దీపిక ఇద్దరు బెంగుళూరు నుంచి వెళ్లి సక్సెస్ అయిన వాళ్లు. సాయి పల్లవి, రష్మిక కూడా సౌత్ నుంచి వెళ్లి స్టార్ లీగ్ లో చేరుతున్న వారే. సాయి పల్లవి టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేసింది చాలా తక్కువ. కానీ చాలా తక్కువ సమయంలోనే బాలీవుడ్ కి ప్రమోట్ అయింది. తొలి సినిమాలో ఏకంగా రాక్ స్టార్ రణబీర్ కపూర్ తోనే నటించే ఛాన్స్ అందుకుంది. అందులోనూ రామాయణంలో భాగం కావడం అన్నది ఇంకా గొప్ప విషయం.
ఇందులో అమ్మడు సీత పాత్రలో మెప్పించ బోతుంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత సాయి పల్లవి బాలీవుడ్ లో సంచలనంగా మారడం ఖాయం. జాతీయ ఉత్తమ నటిగా అవార్డులు...రివార్డులు అందుకోవడం ఖాయమనే మాట అప్పుడే తెరపైకి వస్తోంది. ఇక రష్మిక మందన్నా నేషనల్ క్రష్ గా నీరాజనాలు అందుకుంటోన్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తోంది. అయితే ఇద్దరి లో ఓ కామన్ పాయింట్ ఉంది. ఇద్దరు భారీ కటౌట్లు కాదు.
సాయి పల్లవి ఎత్తు 1.57 మీటర్లు కాగా, రష్మిక మందన్నా హైట్ 1.61 మీటర్లు. కంటెంట్ ఉంటే కటౌట్ తో పనిలేదు అన్నట్లు ఇద్దరు అలా సక్సెస్ అయ్యారు. భవిష్యత్ లో వీరిద్దరు బాలీవుడ్ లో మరింత గొప్ప తారలుగా వెలిగిపోతారని అభిమానులు ఆశీస్తున్నారు. దీపికా పదుకొణే, ఐశ్వర్యా రాయ్ రేంజ్ కి చేరుకుంటారనే అంచనాలున్నాయి.