Begin typing your search above and press return to search.

బాధలోనూ ఫన్ ఉంటుంది : సమంత

కానీ ఆమెను వరుసగా అనారోగ్య సమస్యలు వేధిస్తున్న కారణంగా ఈ ఏడాదిలో ఆమె అనుకున్న టార్గెట్‌ రీచ్ అయ్యేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   11 Jan 2025 8:34 AM GMT
బాధలోనూ ఫన్ ఉంటుంది : సమంత
X

స్టార్‌ హీరో సమంత గత ఏడాది మయో సైటిస్ వ్యాది కారణంగా చాలా బాధ పడ్డ విషయం తెల్సిందే. ఏకంగా ఏడాది కాలం పాటు ఆమె షూటింగ్స్‌కి దూరంగా ఉంది. ఆమె నటించిన సినిమాలు ఈ మధ్య కాలంలో పెద్దగా రావడం లేదు. చాలా కాలం క్రితమే నటించిన సిటాడెల్‌ వెబ్‌ సిరీస్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2024లో ప్రేక్షకులను పెద్దగా ఎంటర్‌టైన్‌ చేయని సమంత 2025లో మాత్రం రెండు మూడు సినిమాలతో రావాలని చాలా పట్టుదలతో ఉంది. ఇప్పటికే ఆమె కొన్ని సినిమాలు కమిట్‌ అయ్యి షూటింగ్స్ సైతం చేస్తుంది. కానీ ఆమెను వరుసగా అనారోగ్య సమస్యలు వేధిస్తున్న కారణంగా ఈ ఏడాదిలో ఆమె అనుకున్న టార్గెట్‌ రీచ్ అయ్యేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

హీరోయిన్‌గా సమంతకు మంచి డిమాండ్‌ ఉంది. అయినా ఆమె వరుస సినిమాలు చేయడం లేదు. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలను ఆచితూచి ఎంపిక చేసుకుంటుంది. వెబ్‌ సిరీస్‌లపై ఆసక్తి ఎక్కువగా చూపిస్తుంది. తాజాగా ఈమె చికెన్ గున్యా సమస్యతో బాధ పడుతున్నట్లు చెప్పుకొచ్చింది. మెల్ల మెల్లగా ఆ జబ్బు నుంచి సమంత బయట పడుతోంది. ఆ విషయాన్ని స్వయంగా సమంత చెప్పుకొచ్చింది. సోషల్‌ మీడియాలో ఎప్పటిలాగే తన హెల్త్‌ అప్‌డేట్‌ను ఇచ్చిన సమంత చికెన్ గున్నా నుంచి కోలుకోవడం కోసం వర్కౌట్‌లు చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను చికెన్ గున్యాకి సంబంధించిన చికిత్స తీసుకుంటూ వర్కౌట్‌లు చేస్తున్నాను అంది.

చికెన్‌ గున్యా వల్ల వచ్చిన కీళ్ల నొప్పులను పోగొట్టుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నంలోనూ ఫన్ ఉంది అంటూ ఈమోజీలను షేర్‌ చేసింది. విపరీతమైన ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధ పడుతున్న సమంత తన బాధను చూపించే విధంగా ఈమోజీలను షేర్ చేసింది. బాధలోనూ జిమ్‌లో సమంత వర్కౌట్‌లు చేస్తుందట. చికెన్‌ గున్యా వల్ల వచ్చే తీవ్రమైన నొప్పులను పోగొట్టుకోవాలి అంటే ఇలాంటి వర్కౌట్‌లు చేయాలి అంటూ కొందరు సమంతకు సలహాలు ఇస్తున్నారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలను తన డైట్‌, తన వర్కౌట్‌లతో పోగొట్టుకున్న సమంతకు ఈ చికెన్‌ గున్యా కీళ్ల నొప్పులు పెద్ద సమస్య కాకపోవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సమంత నటించి 'సిటాడెల్' వెబ్‌ సిరీస్‌కి మంచి స్పందన లభించింది. ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమాలో సమంత నటించేందుకు రెడీ అవుతుంది. అంతే కాకుండా సమంతతో ఒక వెబ్‌ సిరీస్‌కు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ప్లాన్‌ చేస్తున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ బాలీవుడ్‌ మీడియాలో ఆ మధ్య కథనాలు వచ్చాయి. సమంత కోలీవుడ్‌, టాలీవుడ్‌లో సినిమా ఆఫర్లు వచ్చినా సున్నితంగా తిరస్కరిస్తుందని తెలుస్తోంది. ముందు ముందు ఆమె నుంచి కేవలం హిందీ సినిమాలు, సిరీస్‌లు మాత్రమే వస్తాయేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాగ చైతన్య నుంచి విడి పోయిన తర్వాత సమంత మెల్ల మెల్లగా టాలీవుడ్‌కి దూరం అవుతూ వస్తుంది. మంచి డిమాండ్‌ ఉన్నా సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపడం లేదు.