సూపర్ స్టార్ బయోపిక్ తో శంకర్..!
ఐతే శంకర్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఒకవేళ బయోపిక్ చేయాల్సి వస్తే మాత్రం తాను సూపర్ స్టార్ రజినీకాంత్ జీవిత కథ తీస్తానని అన్నారు.
By: Tupaki Desk | 9 Jan 2025 12:30 PM GMTరెండు దశాబ్దాల క్రితమే పాన్ ఇండియా సినిమాలతో అదరగొట్టిన డైరెక్టర్ శంకర్ ఈమధ్య కాస్త ఫాం తగ్గినట్టు అనిపిస్తున్నా మళ్లీ శంకర్ మార్క్ సినిమా వస్తుందని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయన రాం చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేశారు. ఆ సినిమా తో శంకర్ కం బ్యాక్ అదిరిపోతుందని అంటున్నారు. ఐతే శంకర్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఒకవేళ బయోపిక్ చేయాల్సి వస్తే మాత్రం తాను సూపర్ స్టార్ రజినీకాంత్ జీవిత కథ తీస్తానని అన్నారు.
గేమ్ ఛేంజర్ రిలీజ్ సందర్భంగా తమిళ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో శంకర్ ని ఇంటర్వ్యూయర్ మీరేదైనా బయోపిక్ చేయాల్సి వస్తే ఎవరిది చేస్తారని అడిగితే శంకర్ తనకు బయోపిక్ లు చేసే ఆలోచన లేదని అన్నాడు. ఐతే తాను చేయాలనుకుంటే మాత్రం సూపర్ స్టార్ రజినీకాంత్ ది చేస్తానని అన్నారు. ఆయన గురించి అందరికీ తెలిసిందే. కాబట్టి ఆయన బయోపిక్ చేస్తానని అన్నారు.
ఐతే శంకర్ డైరెక్షన్ లో రజిని బయోపిక్ అనగానే దానికి సూటయ్యే హీరో ఎవరని సోషల్ మీడియాలో డిస్కషన్స్ మొదలయ్యాయి. ఒక సాధారణ కండక్టర్ గా జీవితాన్ని మొదలు పెట్టి సూపర్ స్టార్ గా ఎదిగిన తీరు తెలిసిందే. ఐతే ఒక సూపర్ హిట్ సినిమాకు కావాల్సిన సబ్జెక్ట్ రజిని జీవిత కథలో ఉంది. కామన్ టు సూపర్ స్టార్ గా ఎదిగిన సూపర్ స్టార్ బయోపిక్ అది శంకర్ లాంటి డైరెక్టర్ చేస్తే మాత్రం అది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ప్రస్తుతం శంకర్ గేమ్ ఛేంజర్ సినిమా శుక్రవారం రిలీజ్ అవుతుండగా తర్వాత శంకర్ ఇండియన్ 3 సినిమా కూడా రిలీజ్ ప్లాన్ ఉంది.
ఒకప్పుడు తన సినిమాలతో ఆడియన్స్ ని మెప్పిస్తూ వచ్చిన శంకర్ ఈమధ్య ఎందుకో ఆయన రేంజ్ సినిమాలు చేయలేకపోతున్నారు. ఐతే గేమ్ ఛేంజర్ సినిమా మళ్లీ శంకర్ అంటే ఏంటో ప్రూవ్ చేస్తుందని అంటున్నారు. సినిమా పై భారీ అంచనాలు ఉండగా సంక్రాంతికి ఈ సినిమా ఎలాంటి సత్తా చాటుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా శంకర్ పొటెన్షన్ ని ప్రూవ్ చేస్తే మాత్రం ఆయన మళ్లీ టాప్ లీగ్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది.