Begin typing your search above and press return to search.

మాస్ జాతర అమ్మడిని గట్టెక్కించాలి..!

ఈ ఇయర్ మొదట్లో గుంటూరు కారం హిట్ పడ్డా అది పూర్తిగా సూపర్ స్టార్ మహేష్ ఖాతాలోకి వెళ్లింది.

By:  Tupaki Desk   |   1 Jan 2025 1:30 AM GMT
మాస్ జాతర అమ్మడిని గట్టెక్కించాలి..!
X

ఒకటి రెండు సినిమాలతోనే శ్రీలీల టాప్ రేంజ్ హీరోయిన్ క్రేజ్ తెచ్చుకుంది. ఐతే ఎంత తక్కువ టైం లో గ్రాఫ్ పెరిగేలా చేసుకుందో అంతే స్పీడ్ గా పడిపోయింది అమ్మడు. అఫ్కోర్స్ చేస్తున్న సినిమాల్లో హిట్లు ఫ్లాపులు కామనే కానీ సినిమాల్లో తన పాత్రలు ఒకే తరహా అనిపించడం వల్ల అమ్మడికి బ్యాడ్ ఫేజ్ మొదలైంది. ఈ ఇయర్ మొదట్లో గుంటూరు కారం హిట్ పడ్డా అది పూర్తిగా సూపర్ స్టార్ మహేష్ ఖాతాలోకి వెళ్లింది. ఇయర్ ఎండింగ్ లో పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ చేసినా లాభం లేకుండా పోయింది.


శ్రీలీల పుష్ప 2 స్పెషల్ సాంగ్ మీద చాలా హోప్స్ పెట్టుకుంది. ఆ సాంగ్ సంథింగ్ స్పెషల్ కాబట్టే చేశా మాములు సాంగ్ అయితే చేసేద్దాన్ని కాదని చెప్పింది. కానీ శ్రీలీల చేసిన కిసిక్ సాంగ్ కన్నా కూడా రష్మిక పీలింగ్స్ సాగే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంది. ఇక శ్రీలాల చేస్తున్న సినిమాల విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. ఐతే దానికి కాస్త టైం పట్టేలా ఉంది.

మరోపక్క మాస్ మహారాజ్ తో మాస్ జాతర చేస్తుంది శ్రీలీల. ధమాకా కాంబోని రిపీట్ చేస్తూ రవితేజ, శ్రీలీల కలిసి చేస్తున్న ఈ మాస్ జాతర సినిమాను భాను భోగవరపు డైరెక్ట్ చేస్తున్నారు. ఐతే ఈ సినిమాతో మాస్ రాజా హిట్ కొట్టాలని చూడటమే కాదు శ్రీలీల కూడా హిట్ కోసం వేచి చూస్తుంది. ధమాకా తర్వాత శ్రీలీల భగవంత్ కేసరి, గుంటూరు కారం హిట్లు అందుకుంది. ఐతే వాటిలో తనకు తక్కువ పేరు వచ్చింది.

అందుకే మాస్ జాతర సినిమా తో తన సత్తా చాటాలని చూస్తుంది. శ్రీలీల ఉంది అంటే డ్యాన్స్ అదిరిపోతుంది. ఐతే మాస్ జాతరలో శ్రీలీల క్యారెక్టరైజేషన్ కూడా అదిరిపోతుందట. ఇక మీదట ఆడియన్స్ కు తన డ్యాన్స్ తోనే కాదు పర్ఫార్మెన్స్ తో కూడా మెప్పిస్తానని అంటుంది అమ్మడు. మరి శ్రీలీల ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ మాస్ జాతర సినిమా ఆమె ఆశించిన ఫలితాన్ని అందిస్తుందా లేదా అన్నది చూడాలి. మాస్ జాతర మాస్ ఆడియన్స్ ని మెప్పించేలా ఉంటే మాత్రం అటు రవితేజ ఇటు శ్రీలీల తిరిగి సూపర్ ఫాం లోకి వచ్చేయడం పక్కా అని చెప్పొచ్చు.