Begin typing your search above and press return to search.

సుహాస్.. కచ్చితంగా సౌండ్ పెంచాల్సిందే!

తన నేచురల్ యాక్టింగ్ తో ఒక్కో మెట్టు పైకి ఎక్కి ఆడియన్స్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

By:  Tupaki Desk   |   17 Sep 2024 2:38 PM GMT
సుహాస్.. కచ్చితంగా సౌండ్ పెంచాల్సిందే!
X

యంగ్ హీరో సుహాస్.. షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ మొదలు పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తన యాక్టింగ్ తో స్పెషల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. హీరో ఫ్రెండ్ క్యారెక్ట‌ర్స్ లో ఎక్కువగా కనిపిస్తూ మెప్పించారు. తన డైలాగ్స్తో, హావభావాలతో ఆకట్టుకున్నారు. తన నేచురల్ యాక్టింగ్ తో ఒక్కో మెట్టు పైకి ఎక్కి ఆడియన్స్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత హీరోగా కలర్ ఫోటో సినిమాతో మారిపోయారు.

డెబ్యూతో మంచి హిట్ అందుకున్నారు సుహాస్. సినిమాలో ఆయన యాక్టింగ్ కు సినీ ప్రియులు బాగా కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత సుహాస్ క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగింది. హీరోగానే కాకుండా ఇతర కథానాయకుల చిత్రాల్లో కూడా విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. హిట్ 2లో సైకోగా నెగెటివ్ రోల్లో నటించి అందరికీ షాక్ ఇచ్చారు. టాలెంటెడ్ యాక్టర్ గా ముద్ర వేసుకున్నారు. గతేడాది రైటర్ పద్మభూషణ్ గా వచ్చి మరో హిట్ సాధించారు.

ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుని బిజీబిజీగా గడుపుతున్నారు. నాన్ స్టాప్ గా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. లైనప్ లో బోలెడు చిత్రాలను పెడుతున్నారు. 2024లో ఇప్పటికే మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తో హీరోగా హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత శ్రీరంగనీతులు, ప్రసన్నవదనం సినిమాలతో మెప్పించారు. అలా సుహస్ చేస్తున్న సినిమాలు.. మంచి హిట్స్ అవ్వడమే కాకుండా మేకర్స్ కు లాభాలు అందిస్తున్నాయి.

సుహాస్ కు యాక్టర్ గా కూడా మంచి పేరు తీసుకొస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆయన చేతినిండా సినిమాలు ఉన్నాయి. అన్నీ చిన్న చిత్రాలే. వాటిలో ఒకటైన జనక అయితే గనక.. రీసెంట్ గా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల మేకర్స్ విడుదలను వాయిదా వేశారు. త్వరలో కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని తెలిపారు. అదే సమయంలో సుహాస్ మరో మూవీ గొర్రె పురాణం.. సెప్టెంబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. ట్రైలర్ ద్వారా రివీల్ అయిన కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉంది. కానీ గొర్రె పురాణం మూవీకి పబ్లిసిటీ చాలా తక్కువగా ఉందనే చెప్పాలి. రిలీజ్ కు మరో మూడు రోజులే ఉన్నా ఎక్కడా సందడి కనిపించడం లేదు. సుహాస్ సినిమానే రిలీజ్ అవుతుందా అన్నట్లు ఉంది పరిస్థితి. కాబట్టి.. సుహాస్ వీలైనంత ఎక్కువగా ప్రమోట్ చేయాల్సిందే. సౌండ్ పెంచాలి! మరేం చేస్తారో చూడాలి.