వరుణ్ తేజ్.. వరుస ఫ్లాప్స్ వచ్చినా రెమ్యునరేషన్ తగ్గట్లే..
రీసెంగ్ గా వచ్చిన మట్కా టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది.
By: Tupaki Desk | 22 Nov 2024 2:30 PM GMTమెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు ఇప్పటికే ఎవరికి వారు ప్రత్యేకమైన స్టార్ హోదాను సంపాదించుకున్నారు. అయితే కొందరు ఈమధ్య ఎక్కువగా ఫ్లాప్స్ ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వరుణ్ తేజ్ వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్నాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితం రాకపోవడంతో నిరాశలో ఉన్నాడు. రీసెంగ్ గా వచ్చిన మట్కా టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది.
వీకెండ్ లోనే కొన్ని చోట్ల ప్రేక్షకులు లేక షోలు రద్దు కావడం ఈ మెగా హీరోకు ఇప్పటివరకు జరగనిది. ఈ పరిణామాలు వరుణ్ తేజ్‌పై నెగటివ్ టాక్ పెంచాయి. గత మూడు సినిమాలు గని, గాండీవదారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ కూడా దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద కనీసం పది కోట్ల రేంజ్ కూడా కలెక్షన్స్ రావడం లేదంటే వరుణ్ తేజ్ మార్కెట్ రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మట్కా ఇంకాస్త ఎక్కువగానే దెబ్బ కొట్టింది.
అయితే ఫ్లాఫ్స్ ఎన్ని వస్తున్నా కూడా వరుణ్ తేజ్ మాత్రం తన రిమ్యూనరేషన్ విషయంలో మునుపటి తరహాలోనే రూ. 7 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని టాక్. తన తదుపరి ప్రాజెక్టులపై చర్చలు జరుగుతున్నా, ఈ పారితోషికాన్ని తీసుకుఉంటారు అని సమాచారం.
వరుణ్ తేజ్ త్వరలోనే కొరియా కనకరాజు అనే సినిమాతో సెట్స్ మీదకు వెళ్లబోతున్నారు. ఈ చిత్రానికి మెర్లపాక గాంధీ దర్శకత్వం వహించనుండగా, కొరియాలో ఈ సినిమా ముఖ్యమైన భాగం చిత్రీకరించనున్నారు. UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం వరుణ్ తన స్టైల్ మార్చి కొత్త అవతారంలో కనిపించనున్నారని టాక్. దీంతోపాటు, వరుణ్ తేజ్ మరో ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమా ఒక కొత్త తరహా లవ్ స్టోరీగా తెరకెక్కనుంది. ఈ చిత్రం ప్రధానంగా USAలో చిత్రీకరించబడనుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్‌లకు వరుణ్ తేజ్ అందుకునే రెమ్యునరేషన్ రూ. 7 కోట్లు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. వరుసగా ఫ్లాప్‌లు ఎదుర్కొన్నప్పటికీ, తన పారితోషికంలో మాత్రం వరుణ్ అస్సలు తగ్గడం లేదు. ఇక కెరీర్‌కి కీలకమైన తదుపరి రెండు చిత్రాలు విజయవంతమైతే, వరుణ్ తిరిగి ఫామ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. తనకు తగిన కథలు, వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న వరుణ్ తేజ్‌కి ఈ సినిమాలు టర్నింగ్ పాయింట్ అవుతాయేమో చూడాలి.