Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరో లైన‌ప్ లో మారిన డైరెక్ట‌ర్!

అటు సూర్య 44వ చిత్రాన్ని కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌ట్టాలెక్కించిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   28 Sep 2024 12:30 AM GMT
ఆ స్టార్ హీరో లైన‌ప్ లో మారిన డైరెక్ట‌ర్!
X

కోలీవుడ్ స్టార్ సూర్య `కంగువ‌`తో రిలీజ్ కి రెడీ అవుతున్నాడు. ఇది సూర్య 43వ చిత్రం. పిరియాడిక్ యాక్ష‌న్ ఎంటర్ టైన‌ర్ గా రూపొందుతుంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో అంచనాలు భారీగా ఏర్ప‌డ్డాయి. సూర్య కెరీర్ లో తొలిపాన్ ఇండియా రిలీజ్ కూడా ఇదే. రిలీజ్ కోసం అభిమానులంతా ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అటు సూర్య 44వ చిత్రాన్ని కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌ట్టాలెక్కించిన సంగ‌తి తెలిసిందే.

కొన్ని స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ కూడా పూర్త‌యింది. ల‌వ్ అండ్ వార్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్ర‌మిది. అలాగే 45వ చిత్రాన్ని కూడా సూర్య లైన్ లో పెట్టాడు. స్టార్ డైరెక్ట‌ర్ వెట్రీమార‌న్ తో సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టిం చారు. దాన్ని 45 వ చిత్రంగా అనౌన్స్ చేసారు. అయితే ఇప్పుడీ కాంబినేష‌న్ లో సినిమా రావ‌డానికి మ‌రింత ఆస‌ల్యం అవుతుంద‌ని స‌మాచారం. దీంతో సూర్య వెట్రీమార‌న్ స్థానంలో మ‌రో కొత్త ద‌ర్శ‌కుడ్ని తెర‌పైకి తెస్తున్నారు.

వెట్రీమార‌న్ కంటే ముందుగా ఆర్. జె బాలాజీతో ఓ సినిమా చేయాల‌ని సూర్య నిర్ణ‌యించుకున్నాడుట‌. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్స్- వేల్స్ ఫిల్మ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించ‌డానికి ముందుకొస్తున్నాయి. ఇప్ప‌టికే స్టోరీ కూడా లాక్ అయిన‌ట్లు వినిపిస్తుంది. 44వ చిత్రం షూటింగ్ ముగింపు కు చేరుకోగానే ఈ సినిమా షూటింగ్ మొద‌ల‌వుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే ఈ గ్యాప్ లో వెట్రీ మార‌న్ మ‌రో హీరోతో సినిమా చేస్తాడా? లేక సూర్య క‌థపైనే వ‌ర్కౌట్ చేస్తారా? అన్న‌ది తెలియాలి. ఇప్ప‌టికే ఈ కాంబినేష‌న్ లో వాడివాస‌ల్ సినిమా ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. కానీ ఇప్పుడు వ‌రుస క్ర‌మం మారుతోంది కాబ‌ట్టి వాడి వాస‌ల్ 46 చిత్రం అవుతుంది.