Begin typing your search above and press return to search.

సాలిడ్ కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!

అలాంటి వారిలో ఈమధ్య తెలుగు తెర మీద అద్భుతాలు చేస్తున్న నాని.

By:  Tupaki Desk   |   23 Oct 2024 1:31 PM GMT
సాలిడ్ కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!
X

ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా సినీ పరిశ్రమకు వచ్చి స్టార్ గా ఎదగడం అనేది చాలా పెద్ద రిస్క్ తో కూడుకున్న పని. ఎంత కష్టపడినా ఎంత టాలెంట్ ఉన్నా సరే అనుకున్న రేంజ్ కి వెళ్లడం అంత ఈజీ కాదు. అలాంటి వారిలో ఈమధ్య తెలుగు తెర మీద అద్భుతాలు చేస్తున్న నాని. విజయ్ దేవరకొండ వస్తారు. ముఖ్యంగా పెళ్లిచూపులు సినిమాతో సక్సెస్ అందుకుని అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలతో యూత్ స్టార్ గా ఎదిగిన విజయ్ దేవరకొండ సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు.

సినిమాల్లో నటించాలనే కోరికతో చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ వచ్చిన విజయ్ దేవరకొండ స్టార్ అయ్యి ఆడియన్స్ నుంచి అభిమానాన్ని పొందుతున్నాడు. ఐతే ఈమధ్య అతని కెరీర్ లో సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయినా తన ఇమేజ్ కి మాత్రం ఎలాంటి డ్యామేజ్ జరగట్లేదు. అందుకే ఇక మీదట మరింత ఫోకస్ తో పనిచేయాలని డిసైడ్ అయ్యాడు విజయ్ దేవరకొండ.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలో మేకర్స్ భారీ ప్లానింగ్ లోనే ఉన్నారు. వీడీ12 గా వస్తున్న ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఐతే ఈ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు రౌడీ హీరో. సినిమా అవుట్ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్న విజయ్ ఈమధ్యనే కేరళలో తన ఫ్యాన్స్ తో ఈసారి కచ్చితంగా అందరికి మంచి గుర్తుండిపోయే సినిమా ఇస్తానని అన్నాడు.

విజయ్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఇదేదో గట్టిగానే వర్క్ అవుట్ అయ్యేలా ఉంది. జెర్సీ తో తెలుగుతో పాటు హిందీలో కూడా తన సత్తా చాటిన డైరెక్టర్ గౌతం తిన్ననూరి ఈసారి విజయ్ దేవరకొండ తో నెక్స్ట్ లెవెల్ సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే. రవితేజ తో చేసిన మిస్టర్ బచ్చన్ తర్వాత భాగ్య శ్రీకి విజయ్ మూవీ లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు.