అల్లు వారి బ్లెస్సింగ్స్ మృణాల్ కి కలిసొచ్చేనా?
అయితే అల్లు అరవింద్ మాత్రం లావణ్య తెలుగింట కోడలైతే బాగుంటుందనే ముందుగానే గెస్ చేసారు.
By: Tupaki Desk | 30 Oct 2023 11:30 AM GMTలావణ్య త్రిపాఠి మెగా ఇంట కోడలవుతుందని ఎవరైనా ఊహించారా? అంటే కనీసం ఎవరికీ ఊహకి కూడా రానిది. కానీ ఇప్పుడది జరుగుతుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని ప్రేమ వివాహం చేసుకుని కొణిదెల ఇంటి కొత్త కోడలిగా అడుగు పెట్టబోతుంది. అయితే అల్లు అరవింద్ మాత్రం లావణ్య తెలుగింట కోడలైతే బాగుంటుందనే ముందుగానే గెస్ చేసారు. అందుకే తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుని హైదరాబాద్లో స్థిరపడితే బాగుంటుందనే జోస్యం చెప్పారు.
ఆయన చెప్పినట్లే ఇప్పుడు జరుగుతుంది. అదే ఇంట కుటుంబ సభ్యురాలు కాబోతుంది. ఇకపై వరుస పెట్టి అల్లు అరవింద్ ని లావణ్య పిలబోతుంది. సరిగ్గా ఇలాగే ముంబై హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ని కూడా అరవింద్ సార్ బ్లెస్ చేసిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2023 సైమా అవార్డు వేడుకల్లో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలిప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. గతంలో ఓ హీరోయిన్ ని హైదరాబాద్ అబ్బాయిని పెళ్లి చేసుకుని తెలుగింట కోడలిగా రమ్మని బ్లెస్ చేసా.
ఆ తర్వాత అదే తెలుగు హీరోతో ప్రేమలో పడింది. త్వరలో పెళ్లి చేసుకుంటుంది. ఇప్పుడు నిన్ను కూడా బ్లెస్ చేస్తున్నా. నువ్వు కూడా ఇక్కడికి తిరిగి వచ్చేయాలని కోరుకుంటున్నా అని నవ్వేసారు. క్రిటిక్స్ విభాగం లో మృణాల్ ఠాకూర్ సీతారామం చిత్రానికి గాను మృణాల్ అవార్డు అందుకుంది. అల్లు అరవింద్ చేతుల మీదుగా ఆమె అవార్డు తీసుకుంది. ఈ సందర్భంగానే అరవింద్ ఆ వ్యాఖ్యలు చేసారు. మరి ఆయన వ్యాఖ్యలు ఫలించి తెలుగు అబ్బాయిని మృణాల్ పెళ్లి చేసుకుంటే సరి.
ప్రస్తుతం అమ్మడి టాలీవుడ్ కెరీర్ దేదీప్య మానంగా సాగిపోతుంది. `సీతారామం` తర్వాత ఎలాంటి పాత్రలు చేయాలి? అన్నదానిపై కొంత కన్ ప్యూజన్ కి గురైన క్రమంలో కొత్త సినిమాలకు సైన్ చేయడం ఆలస్య మైంది. కానీ మంచి చిత్రాలు ఒడిసిపట్టుకుంది. అలాగే బాలీవుడ్ అవకాశాలు కూడా అందు కుంటుంది. సీతారమం తర్వాత హిందీలో కొన్ని సినిమాలు చేసింది.