యానిమల్ 'బాహుబలి'ని టచ్ చేస్తాడా?
యానిమల్ విడుదల రోజు రూ.50 కోట్ల నికర వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని తన అధికారిక ఎక్స్ నివేదికలో పేర్కొంది.
By: Tupaki Desk | 25 Nov 2023 3:30 AM GMTరణబీర్ కపూర్ నటించిన 2023 మోస్ట్ అవైటెడ్ చిత్రం 'యానిమల్' డిసెంబర్ 1న పెద్ద తెరపైకి రానుంది. యానిమల్ నిర్మాతలు సినిమా థియేటర్లలో విడుదల చేయడానికి దాదాపు వారం రోజుల ముందు (గురువారం) ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ చిత్రంలో రణబీర్ నటనా వైవిధ్యానికి పరవశులైన అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. ట్రైలర్ లోని కొన్ని ఎమోషనల్ సీన్లు ఇప్పటికే ఇంటర్నెట్‌లో అధికంగా ట్రెండ్ అవుతున్నాయి. రణబీర్ కి ఇన్నాళ్టికి ఒక పర్ఫెక్ట్ పాన్ ఇండియా మూవీ పడిందని టాక్ వినిపిస్తోంది. అతడు కలలుగన్న పాన్ ఇండియా హిట్ యానిమల్ తో వస్తుందని అంతా అంచనా వేస్తున్నారు. ప్రఖ్యాత ట్రేడ్ ఎనలిస్ట్ సాక్‌నిల్క్ ఎంటర్‌టైన్‌మెంట్ నివేదిక ప్రకారం.. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ప్రారంభ రోజున భారీ రికార్డులకు తెర తీసే అవకాశం ఉందని అంచనా వేసింది. యానిమల్ విడుదల రోజు రూ.50 కోట్ల నికర వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని తన అధికారిక ఎక్స్ నివేదికలో పేర్కొంది. అయితే యానిమల్ కి అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా ప్రారంభం కాలేదు. తాజా నివేదికల ప్రకారం.. ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుండి A సర్టిఫికేట్ మంజూరు అయింది. దీని రన్‌టైమ్ 3 గంటల 21 నిమిషాల 23 సెకన్లకు పైగా ఉంది.
యానిమల్ ట్రైలర్ బిగ్ హిట్:
యానిమల్ ట్రైలర్ విడుదలైన వెంటనే, అభిమానులు దానిపై సోషల్ మీడియాల్లో విరుచుకుపడ్డారు. రణ్‌బీర్ కపూర్, అనిల్ కపూర్‌ల తండ్రీకొడుకుల పాత్రలను సందీప్ వంగా ఎలివేట్ చేసిన తీరుపైన.. నేరేట్ చేసిన క్లిప్స్ లో ఓ సన్నివేశంపైనా అత్యధికంగా స్పందిస్తున్నారు. ఆ సన్నివేశంలో, రణబీర్ మైఖేల్ జాక్సన్ కచేరీకి అనుమతి కోరుతూ తన తండ్రిని చిన్నవాడిగా నటించమని అడుగుతాడు. అనిల్ చిన్నవాడైన రణబీర్ ని ''పాపా, పాపా, పాపా'' అని అంటున్నప్పుడు రణబీర్ ''సునై దే రహా హై బెహ్రా నహీ హున్ మైన్ (నేను వినగలను, నేను చెవిటివాడిని కాదు)'' అని అరుస్తూ ఊహించని ట్విస్టిచ్చాడు. తండ్రీకొడుకుల పాత్రలు ఆడియెన్ మైండ్ ని బ్లో అయ్యేలా చేసాయి. రణబీర్ - అనిల్ కపూర్ మధ్య సంబంధం తండ్రి కొడుకులు అనే కంటే విలక్షణమైనది.. ఆసక్తికరమైనది.
అర్జున్ రెడ్డి- కబీర్ సింగ్ తర్వాత సందీప్ రెడ్డి వంగా ష్యూర్ షాట్ గా మరో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడంటూ ఇప్పటికే సమీక్షకులు విశ్లేషించడం చూస్తుంటే యానిమల్ పై హైప్ ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ భారీ పాన్-ఇండియా చిత్రంలో రష్మిక మందన్న కథానాయిక. ఈ సినిమా ఆద్యంతం తండ్రీ కొడుకుల చుట్టూ తిరుగుతుంది. మధ్యలో ప్రేమికురాలైన రష్మిక పాత్ర కూడా క్రష్ పెంచేలా ఉంది. ట్రైలర్ ప్రకారం.. ఇది విపరీతమైన రక్తపాతం నేపథ్యంలో సాగుతుందని కూడా అర్థమైంది. అయితే తండ్రి కొడుకుల ప్రేమకథలో ప్రతీకారం అనే థీమ్ సంచలనం కానుంది.
బాహుబలి 2 రికార్డులు కొట్టేస్తుందా?
పాపులర్ శాక్ నిల్క్ అంచనా ప్రకారం.. సందీప్ వంగా చిత్రం బాహుబలి 2 రికార్డులను భారతదేశ మార్కెట్లో టచ్ చేస్తుందని కూడా భావిస్తున్నారు. ఇటీవలే విడుదలై బంపర్ హిట్లు కొట్టిన పఠాన్-జవాన్ - టైగర్ 3 ఓపెనింగులను కూడా ఈ చిత్రం అధిగమిస్తుందని భావిస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే.. ఇది తెలుగువాడైన సందీప్ వంగా ఘనత అని బాలీవుడ్ ఒప్పుకోవాలి. అయితే బాహుబలి 2 రికార్డులను కొట్టేయడం అంత సులువేమీ కాదు. బాహుబలి 2 హిందీ వెర్సన్ తొలిరోజు 40కోట్లు వసూలు చేయగా, ప్రాంతీయ భాషల నుంచి మరో 80కోట్లు వసూలు చేసింది. ఓవరాల్ గా 120కోట్ల గ్రాస్ వసూళ్లతో సంచలనం సృష్టించింది. అంటే యానిమల్ కూడా 120కోట్ల రేంజులో గ్రాస్ ని లేదా 80కోట్ల రేంజులో నికర వసూళ్లను సాధించాల్సి ఉంటుంది. పఠాన్- జవాన్ చిత్రాలు 100 కోట్లు పైగా వరల్డ్ వైడ్ ఓపెనింగులు సాధించాయని కథనాలొచ్చాయి. అయితే ఆ రేంజును కూడా యానిమల్ టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.
భూషణ్ కుమార్ -క్రిషన్ కుమార్ టి-సిరీస్, మురాద్ ఖేతాని సినీ1 స్టూడియోస్ - ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన యానిమల్ డిసెంబర్ 1 న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో వెండితెరపైకి రానుంది. ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుండి A సర్టిఫికేట్ మంజూరు అయింది. దీని రన్‌టైమ్ 3 గంటల 21 నిమిషాల 23 సెకన్లకు పైగా ఉంది.