Begin typing your search above and press return to search.

బాలయ్య రేంజ్ ఏ స్థాయిలో పెరిగిందంటే..

ఆ తర్వాత గత ఏడాది సంక్రాంతికి వీరసింహా రెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు బాలయ్య.

By:  Tupaki Desk   |   11 Jun 2024 1:25 PM GMT
బాలయ్య రేంజ్ ఏ స్థాయిలో పెరిగిందంటే..
X

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణకు తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్ లో ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. కొన్నేళ్ల క్రితం వరుస ఫ్లాపులతో సతమతమైన నటసింహం.. అఖండతో హిట్ ట్రాక్ ఎక్కారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. బాలయ్య డైలాగులకు ఆయన ఫ్యాన్స్ ఊగిపోయారు. రిపీట్ మోడ్ లో సినిమా చూశారు.

ఆ తర్వాత గత ఏడాది సంక్రాంతికి వీరసింహా రెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు బాలయ్య. అదే సంవత్సరం దసరాకి భగవంత్ కేసరి సినిమాతో వచ్చి హ్యాట్రిక్ హిట్ ను సాధించారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఆ మూవీ మంచి వసూళ్లు సాధించింది. దీంతో ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య.. ఇప్పుడు డైరెక్టర్ బాబీతో కలిసి NBK 109 సినిమా చేస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ అయింది.

గ్లింప్స్ లో బాలయ్య మాస్ లుక్ అండ్ యాక్షన్ అదిరిపోయింది. ఫైట్ సీక్వెన్స్ లు సినిమాలో ఓ రేంజ్ లో ఉంటాయని అర్థమైంది. ఇక బాలయ్య బర్త్ డే సందర్భంగా.. బాలకృష్ణ, బోయపాటి మూవీ- BB 4 అనౌన్స్మెంట్ వచ్చింది. బోయపాటి, బాలకృష్ణ సూపర్ హిట్ కాంబో అన్న విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్ లో ఇప్పటికే మూడు సినిమాలు రాగా.. ఒకదానికి మించి మరొకటి హిట్ అయ్యాయి. దీంతో వీరి కాంబోలో నాలుగో సినిమాపై అప్పుడే అంచనాలు నెలకొన్నాయి.

14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట రూపొందించనున్న ఈ సినిమాకు గాను బాలయ్య అందుకునే రెమ్యునరేషన్ పై నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది. నటసింహం రూ.34 కోట్ల పారితోషికం అందుకుంటారని టాక్ వినిపిస్తోంది. NBK 109 సినిమా కన్నా ఈ మూవీకి బాలయ్య ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఆయన చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరించనుంది.

అయితే బాలయ్య తన రూలర్ మూవీకి రూ.6 కోట్ల పారితోషకం అందుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత క్రమంగా రెమ్యునరేషన్ రూ.10 కోట్లకు పెంచినట్లు సమాచారం. వీరసింహారెడ్డికి రూ.14 కోట్లు తీసుకున్న బాలయ్య.. భగవంత్ కేసరికి రూ.18 కోట్లు అందుకున్నారట. NBK 109 మూవీకి రూ.30 కోట్లు తీసుకుంటున్న నటసింహం.. ఇప్పుడు బోయపాటి మూవీకి రూ.34 కోట్లు అందుకోనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

కాగా.. రెమ్యునరేషన్ తగ్గట్లే బాలయ్య మార్కెట్ కూడా అలానే పెరుగుతోంది. భారీ బడ్జెట్ తో సినిమాలు తీస్తున్న బాలకృష్ణ మేకర్స్.. వసూళ్లు కూడా అదే విధంగా అందుకుంటున్నారు. నష్టాలు లేకుండా సేఫ్ అవుతున్నారు. దీంతో అనేక మంది తెలుగు నిర్మాతలు.. బాలయ్యతో వర్క్ చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరి బాలయ్య.. భవిష్యత్తులో రెమ్యునరేషన్ ఇంకెంతో పెంచుతారో చూడాలి.