2024 లోనైనా భాజాలు మ్రోగిస్తారా?
కానీ ఆ ఘట్టం మాత్రం చోటు చేసుకోవడం లేదు. ముందుగా ప్రభాస్ గురించి మొదలు పెడితే అతని పెళ్లి గురించి ఆరేడళ్లగా మీడియాలో కథనాలు పతాక స్థాయిలో వస్తున్నాయి.
By: Tupaki Desk | 31 Dec 2023 7:44 PM GMTపెళ్లికాని ప్రసాద్ ల లిస్ట్ టాలీవుడ్ లో చాలా పెద్దదే ఉంది. ఎప్పటికప్పడు ఈ లిస్ట్ లో మెంబర్లు పెరుగు తారే తప్ప! తగ్గిన సందర్భాలు తక్కువ. ఎందుకంటే కెరీర్ కి ఇచ్చిన ప్రాధాన్యత పెళ్లికివ్వడం అన్నది క్రమ క్రమంగా తగ్గుతుంది. ఏ వయసులో జరగాల్సింది..ఆ వయసులో జరగాలి అంటారు? కానీ ఇప్పుడు పెళ్లిళ్లకు వయసు అంటూ లేదు. ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు. రెండు..మూడేళ్లగా ఈ స్టార్ హీరోలంతా ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా? వాళ్ల జీవితాల్లోకి ఏ అమ్మాయి వస్తుందా? అని ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కానీ ఆ ఘట్టం మాత్రం చోటు చేసుకోవడం లేదు. ముందుగా ప్రభాస్ గురించి మొదలు పెడితే అతని పెళ్లి గురించి ఆరేడళ్లగా మీడియాలో కథనాలు పతాక స్థాయిలో వస్తున్నాయి. ఇదిగో పెళ్లి..అదిగో పిల్ల అంటూ ప్రచారం తప్ప ఇంతవరకూ ఆయన పెళ్లి చేసుకుంది లేదు. ఇప్పటికే 40 దాటేసాయి. పెళ్లెప్పుడు అంటే చేసుకుందాం డార్లింగ్ అని స్కిప్ కొడతారు. ఇక విశాల్ కి 46 ఏళ్లు వచ్చేసాయి. ఇంతవరకూ ఆయనా పెళ్లి చేసుకోలేదు. గతంలో ఓ అమ్మాయితో ఎంగేజ్ మెంట్ జరిగింది. కానీ అది పెళ్లి వరకూ వెళ్లలేదు.
అఖిల్ పెళ్లి విషయంలో కూడా ఇలాగే జరిగింది. వయసు చిన్నదే అయినా ఎంగేజ్ మెంట్ చేసుకుని క్యాన్సిల్ చేసుకున్నాడు. ఇక ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొతినేని పెళ్లి మీద ఎలాంటి దృష్టి పెట్టలేదు. కెరీర్ అంటూ ముందుకెళ్తున్నాడు తప్ప! పెళ్లి అనే టాపిక్ ఇంకా తేవడం లేదు. ఇప్పటికే ఆయన వయసు 35 ఏళ్లు. అలాగే విజయ్ దేవరకొండ `ఖుషీ` తీసిన తర్వాత మనసు పెళ్లిమీద లాగుతుందన్నాడు. ఆయన వయసు 34. ఈ నేపథ్యంలో 2024లో మెగించేస్తాడేమో చూడాలి.
ఇక మెగా అల్లుడు సాయితేజ్ పెళ్లి ఎప్పుడు? అంటూ ఇప్పటికే నెట్టింట వాయించేస్తున్నారు నెటి జనులు. వాళ్లకు సమాధానాలు చెప్పలేక స్కిప్ కొడుతున్నాడు. అతడి వయసు 37 ఏళ్లు. ఇక అల్లు శిరీష్ సినిమాలు చేయడం లేదు.. పెళ్లి చేసుకోవడం లేదు. అతని వయసు 36 ఏళ్లు. ఇంకా కెరీర్ కోసం పోరాటం చేస్తున్నాడు. మరి 2024 లో తాళి కట్టే కార్యక్రమాలు ఏవైనా చేస్తారా? అన్నది చూడాలి. అలాగే యంగ్ హీరో అడవిశేషు కూడా ఓ ఇంటివాడు కావాలి. కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు. పెళ్లి కూడా షురూ చేస్తే ఓపనైపోతుంది. మరి వీళ్లంతా 2024 లోనైనా భాజా భజంత్రీలు మోగిస్తారేమో అన్నది చూడాలి.