Begin typing your search above and press return to search.

ఆ బారమంతా దేవరపైనే..

చిన్న సినిమాలు సూపర్ హిట్ అయిన కూడా ఒకేసారి భారీ ఎత్తున ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పించలేవు.

By:  Tupaki Desk   |   16 Aug 2024 3:51 AM GMT
ఆ బారమంతా దేవరపైనే..
X

థియేటర్స్ లో భారీగా ప్రేక్షకులని రప్పించగల సినిమాలు గత కొంతకాలం నుంచి బాగా తగ్గిపోయాయి. పెద్ద సినిమాలు వస్తున్న కూడా ప్రేక్షకులని మెప్పించడంలో విఫలం అవుతున్నాయి. స్టార్ హీరోల నుంచి ఏడాదికి ఒక సినిమా రావడం గగనం అయిపొయింది. డిజిటల్ ఎక్స్ పీరియన్స్ కి అలవాటు పడిన ప్రేక్షకులు సినిమా ఏవరేజ్ గా ఉందనే టాక్ వస్తే చూడటానికి ఇష్టపడటం లేదు. ఓటీటీలో రిలీజ్ అయ్యాక చూసుకోవచ్చనే ధీమాతో ఉంటున్నారు. సూపర్ హిట్ టాక్ వస్తేనే తప్ప థియేటర్స్ కి ఆడియన్స్ రావడం లేదు.

చిన్న సినిమాలు సూపర్ హిట్ అయిన కూడా ఒకేసారి భారీ ఎత్తున ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పించలేవు. మౌత్ టాక్ తో మెల్లగా ఈ సినిమాలు జనాల్లోకి వెళ్తాయి. అలాగే పబ్లిక్ కూడా వీకెండ్ లోనే సినిమా చూసేయాలనే ఇంటెన్షన్ తో ఉండరు. నిలకడగా ఈ సినిమాలకి కలెక్షన్స్ వస్తాయి. అయితే మాస్ అప్పీల్ ఉన్న కథలు ప్రేక్షకుల ముందుకొస్తే క్రౌడ్ ని పెద్ద ఎత్తున థియేటర్స్ లోకి రప్పించగలవు. సూపర్ హిట్ అనే మౌత్ టాక్ వస్తేనే ఆ సినిమాలు క్రౌడ్ పుల్లర్స్ గా మారుతాయి.

ఈ ఏడాది అలా మాస్ అప్పీల్ తో స్టార్ హీరోల నుంచి రెండు సినిమాలు మాత్రమే థియేటర్స్ లోకి వచ్చాయి. అవి సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం, ప్రభాస్ కల్కి. వీటిలో గుంటూరు కారం ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. దీంతో హనుమాన్ మూవీ మంచి టాక్ తో క్రౌడ్ పుల్లర్ చిత్రంగా మారింది. గత నెల రిలీజ్ అయిన కల్కి 2898ఏడీ సినిమా సూపర్ హిట్ టాక్ తో భారీగా ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పించింది. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమా పబ్లిక్ ని ఎట్రాక్ట్ చేసి థియేటర్స్ కి వచ్చేలా చేసింది.

తాజాగా రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్, రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలలో ఒకటైన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని సినీ విశ్లేషకులు ఎక్స్ పెక్ట్ చేశారు. అయితే ఈ రెండింటికి మిక్స్డ్ టాక్ వస్తోంది. ఇవి ఎంత వరకు క్రౌడ్ ని థియేటర్స్ కి తీసుకొని రాగలవనేది వేచి చూడాలి. నెక్స్ట్ రాబోయే సినిమాలలో చూసుకుంటే దేవర సినిమాకి మాత్రమే పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్స్ కి రప్పించే సత్తా ఉంది. ఈ మూవీ మాస్ బొమ్మగా రాబోతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ తో నార్త్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ పెరిగింది.

తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీలో కూడా డిస్టిబ్యూటర్స్, బయ్యర్లకి అతి పెద్ద హాప్ గా దేవర మూవీ కనిపిస్తోంది. ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ అయితే మూవీకి మంచి హైప్ తీసుకొచ్చాయి. నెక్స్ట్ చిత్ర యూనిట్ నుంచి రాబోయే మూవీ టీజర్, ట్రైలర్ ఉండబోతున్నాయి అనే దానిపై పబ్లిక్ అటెన్షన్ ఉంటుంది. కొరటాల శివ ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత దేవర మూవీ చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ లో కూడా ఒకింత టెన్షన్ అయితే ఉంది. కానీ కంటెంట్ ని ప్రెజెంట్ చేసే పోస్టర్స్, గ్లింప్స్ అయితే సినిమా మీద నమ్మకం పెంచుతున్నాయి. మరి దేవర మూవీ ఏ మేరకు ఈ ఏడాది క్రౌడ్ పుల్లర్ గా మారుతుందనేది వేచి చూడాలి.