Begin typing your search above and press return to search.

GOAT ప్రయోగం.. రిస్క్ చేస్తున్నారా?

దీంతో దర్శకులు కూడా నెక్స్ట్ లెవల్ లో తెరపై విజువల్స్ ని ప్రెజెంట్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   15 Aug 2024 9:27 AM GMT
GOAT ప్రయోగం.. రిస్క్ చేస్తున్నారా?
X

ప్రస్తుతం సినిమా కంటెంట్ యూనివర్సలైజ్ అయ్యింది. కథలు చెప్పే విధానం కూడా మారుతోంది. నిర్మాతలు వందల కోట్ల బడ్జెట్ ని స్టార్ హీరోల మీద పెట్టడానికి ముందుకొస్తున్నారు. దీంతో దర్శకులు కూడా నెక్స్ట్ లెవల్ లో తెరపై విజువల్స్ ని ప్రెజెంట్ చేస్తున్నారు. లార్జర్ దెన్ లైఫ్ కథలు అన్ని భాషలలో ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. సినిమాలని కూడా వీలైనన్ని ఎక్కువ భాషలలో రిలీజ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆర్టిస్ట్స్ లని కూడా విభిన్న భాషల నుంచి తీసుకుంటున్నారు. అన్ని ప్రాంతాల వారికి కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలని ఆయా భాషలకి చెందిన నటీనటులకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే హిందీ యాక్టర్స్ సౌత్ సినిమాలలో, సౌత్ స్టార్స్ బాలీవుడ్ చిత్రాలలో కనిపిస్తున్నారు. అయితే కొంతమంది దర్శకులు మాత్రం తమ సినిమాలలో ప్యాడింగ్ ఆర్టిస్ట్స్ లు ఎక్కువగా ఉండేలా చూసుకుంటారు. ప్రాధాన్యత లేని పాత్రలలో అయిన కూడా స్క్రీన్ పై ఎక్కువ మంది పేరున్న ప్యాడింగ్ యాక్టర్స్ కనిపిస్తే విజువల్ కి నిండుదనం వస్తుందని భావిస్తారు.

తెలుగులో బోయపాటి శ్రీను ఇదే పంథా ఫాలో అవుతారు. అతను చేసే సినిమాలలో బలమైన పాత్రలు అంటే 5 నుంచి 10 మధ్యలోనే ఉంటాయి. అయితే స్క్రీన్ మీద చూసినపుడు చాలా మంది యాక్టర్స్ కనిపిస్తారు. సింగిల్ డైలాగ్ ఉన్న కూడా బాగా పేరున్న ఆర్టిస్ట్స్ ని తీసుకుంటారు. ఇప్పుడు వెంకట్ ప్రభు కూడా విజయ్ తో చేస్తోన్న GOAT సినిమా కోసం బోయపాటి ఫార్ములా ఫాలో అవుతున్నట్లు ఉంది. చాలా మంది ఫేమ్ ఉన్న యాక్టర్స్ GOAT మూవీలో నటిస్తున్నారు.

వీరిలో చాలా మంది ఫేడ్ అవుట్ అయిపోయిన వారు కావడం గమనార్హం. ప్రశాంత్, లైలా, స్నేహ, ప్రభుదేవా, వైభవ్, అజ్మల్ లాంటి యాక్టర్స్ GOAT మూవీలో ఉన్నారు. వీరందరితో ఉన్న ఒక పోస్టర్ ని రీసెంట్ గా రిలీజ్ చేయగా దీనికి నెగిటివ్ టాక్ వచ్చింది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా GOAT సినిమాని వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా అప్పీల్ ఉండేలా డిఫరెంట్ లాంగ్వేజ్ ల నుంచి యాక్టర్స్ ని తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అలా కాకుండా ఒకే భాషకి చెందిన వారిని గంపగుత్తగా పెడితే కేవలం ఒక భాషకి సినిమా పరిమితం అయిపోయే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. GOAT సినిమాలో విజయ్ రెండు భిన్నమైన టైం లైన్స్ లో విభిన్న పాత్రలలో కనిపిస్తున్నారు. సినిమా మీద ఫ్యాన్స్ చాలా ఎక్స్ పెక్టేషన్స్ తో ఉన్నారు. అయితే గతంలో ఎప్పుడో కనిపించిన యాక్టర్స్ ని తీసుకొచ్చి మూవీలో నటింపజేస్తే అది ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి మరి.