Begin typing your search above and press return to search.

స్టార్ డైరెక్టర్ కి వెయిటింగ్ ఎన్నాళ్లో..?

లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వీర సింహా రెడ్డి తో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేనికి సినిమా చేద్దామంటే హీరో దొరకట్లేదు.

By:  Tupaki Desk   |   1 Jun 2024 3:30 PM GMT
స్టార్ డైరెక్టర్ కి వెయిటింగ్ ఎన్నాళ్లో..?
X

అదేంటో టాలీవుడ్ లో హిట్టు కొట్టినా సరే డైరెక్టర్స్ కి హీరోలు కరువవుతున్నారు. స్టార్ హీరోలంతా కూడా పాన్ ఇండియా సినిమాలతో దూసుకెళ్తుంటే టైర్ 2 హీరోలు కూడా వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ టైం లో ఒక సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే హీరోని పిక్ చేసుకోకపోతే మాత్రం ఏళ్లకు ఏళ్లు వెయిట్ చేయక తప్పట్లేదు. ప్రస్తుతం డైరెక్టర్ గోపీచంద్ మలినేని పరిస్థితి అదేలా ఉంది. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వీర సింహా రెడ్డి తో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేనికి సినిమా చేద్దామంటే హీరో దొరకట్లేదు.

వీర సింహా రెడ్డి చేశాక బాలయ్య భగవంత్ కేసరి చేసి అది సక్సెస్ కొట్టి ఇప్పుడు బాబీ సినిమా చివరి దశకు తీసుకొచ్చాడు. కానీ గోపీచంద్ మాత్రం మరో సినిమా చేయలేదు. మాస్ మహరాజ్ రవితేజతో గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమా అనుకున్నారు. క్రాక్ లాంటి సూపర్ హిట్ తర్వాత ఈ కాంబో సినిమా అనగానే ఆడియన్స్ లో క్రేజ్ ఏర్పడింది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లకుండానే సినిమాను ఆపేశారు.

బడ్జెట్ ఇష్యూస్ వల్ల సినిమా ఆగిపోయిందని తెలిసింది. ఈ సినిమా ఆగిపోయిన వెంటనే హరీష్ శంకర్ తో మిస్టర్ బచ్చన్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు రవితేజ. కానీ గోపీచంద్ మాత్రం హీరో దొరక్క వెయిట్ చేస్తూనే ఉన్నాడు. గోపీచంద్ తో సినిమా తీసేందుకు హీరోలు ఎవరు ముందుకు రావట్లేదా అంటే అలా అని కాదు కానీ ఆల్రెడీ ప్రతి హీరో చేస్తున్న సినిమా కాకుండా మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టాడు. ఈ టైం లో గోపీచంద్ తో సినిమా కష్టమని అంటున్నారు.

గోపీచంద్ తో సినిమా అంటే ప్రొడ్యూసర్స్ రెడీ.. హీరోయిన్స్ మిగతా కాస్టింగ్ అంతా రెడీ కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరో దొరకడమే కష్టంగా ఉంది. మరి తను అనుకున్న కథకు పర్ఫెక్ట్ హీరో దొరికే దాకా గోపీచంద్ వెయిట్ చేస్తాడా లేదా ఏ హీరో డేట్స్ ఇస్తే ఆ హీరోకి తగిన సినిమాతో వస్తాడా అన్నది చూడాలి. మాస్ ఆడియన్స్ మాత్రం గోపీచంద్ ఫాస్ట్ గా సినిమాలు చేయాలని ఆశిస్తున్నారు. వీర సింహా రెడ్డి తో బాలయ్యను ఇంప్రెస్ చేసిన గోపీచంద్ మళ్లీ ఈ కాంబో రిపీట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని తెలుస్తుంది.