ఓవర్సీస్ లో గుంటూరు కారం వాటిని బీట్ చేస్తుందా?
ఈ స్థాయిలో మార్కెట్ మార్కెట్ ఉన్న తక్కువ మంది స్టార్స్ లో మహేష్ బాబు ఒకరని చెప్పాలి.
By: Tupaki Desk | 6 Jan 2024 4:07 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకి దేశ వ్యాప్తంగా 150 కోట్లకి పైగా మార్కెట్ ఉంది. ఈ స్థాయిలో మార్కెట్ మార్కెట్ ఉన్న తక్కువ మంది స్టార్స్ లో మహేష్ బాబు ఒకరని చెప్పాలి. ఈజీగా అతని సినిమాలు 200 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకుంటున్నాయి. శ్రీమంతుడు సినిమా తర్వాత సక్సెస్ రేట్ కూడా మహేష్ కి ఎక్కువగానే ఉంది. ఒక్క స్పైడర్ తప్ప పెద్దగా ఫ్లాప్స్ లేవు.
ఓవర్సీస్ మార్కెట్ లో కూడా మహేష్ సినిమాలకి మంచి డిమాండ్ ఉంది. ఆయన సినిమాలు 2 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేస్తున్నాయి. ఓవర్సీస్ లో సర్కారువారి పాట మూవీ 2.3 మిలియన్ డాలర్స్ గ్రాస్ కలెక్ట్ చేసింది. ఫస్ట్ డే 7.92 కోట్ల గ్రాస్ ని హైయెస్ట్ గా అందుకుంది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీని తర్వాత సరిలేరు నీకెవ్వరు మూవీ రెండో స్థానంలో నిలిచింది.
ఈ మూవీ ఓవరాల్ గా 2.2 మిలియన్ డాలర్స్ గ్రాస్ అందుకుంటే మొదటి రోజు కలెక్షన్స్ 6.34 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. మూడో స్థానంలో మహర్షి మూవీ 1.8 మిలియన్ డాలర్స్ ని ఓవర్సీస్ లో కలెక్ట్ చేసింది. ఈ సినిమా ఓపెనింగ్ డే ప్రీమియర్ షోతో కలిసి. 4.23 కోట్లు కొల్లగొట్టింది. అయితే ఓవరాల్ కలెక్షన్స్ పరంగా భారత్ అనే నేను సినిమా టాప్ ఓవర్సీస్ లో టాప్ ప్లేస్ లో ఉంది.
ఈ సినిమా ఏకంగా 3.4 మిలియన్ డాలర్స్ ని అందుకుంది. అలాగే ఫస్ట్ డే కూడా ప్రీమియర్ షోతోకలిపి 11 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయగలిగింది. ఈ సినిమాకి ఉన్న హైప్ కారణంగా ఈ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. ఓవరాల్ గ్రాస్ పరంగా రెండో స్థానంలో నిలిచింది శ్రీమంతుడు మూవీ అని చెప్పాలి. ఈ సినిమా 2.8 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసింది.
ఇలా శ్రీమంతుడు తర్వాత స్పైడర్, బ్రహ్మోత్సవం తప్ప అన్ని సినిమాలు 2 మిలియన్ క్లబ్ లో చేరాయి. అయితే భరత్ అనే నేను సినిమా ఆల్ టైం రికార్డ్ ని వేరే సినిమాలు బ్రేక్ చేయలేదు. గుంటూరు కారం సినిమాకి ఏకంగా 5408 థియేటర్స్ లో ప్రీమియర్స్ వేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ కంటే వెయ్యి థియేటర్స్ అధికంగా ఈ మూవీ ప్రీమియార్స్ పడనున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే మొదటి రోజే 1 మిలియన్ డాలర్స్ ని గుంటూరు కారం కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.