Begin typing your search above and press return to search.

కీర్తి పాప ఏకంగా బన్నీతోనే సై అంటుందే..

ఆ మధ్య అమ్మడు లేడి ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా చేసిన ఈ బ్యూటీ ఈ మధ్య మాత్రం బిగ్ ఛాన్సులు అందుకునే ప్రయత్నం చేస్తోంది.

By:  Tupaki Desk   |   1 Jun 2024 4:00 AM GMT
కీర్తి పాప ఏకంగా బన్నీతోనే సై అంటుందే..
X

నేడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న కీర్తి సురేష్ తన ప్రయాణాన్ని మొదట సింపుల్ గా "నేను శైలజ" చిత్రంతో ప్రారంభించింది. "మహానటి" వంటి సినిమాలతో కీర్తి క్రేజ్ ఆకాశాన్నంటింది. "దసరా" వంటి హిట్లతో తన స్థాయిని మరింత పెంచుకున్న ఈ చిన్నది, ప్రస్తుతం తమిళ, బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంది. ఆ మధ్య అమ్మడు లేడి ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా చేసిన ఈ బ్యూటీ ఈ మధ్య మాత్రం బిగ్ ఛాన్సులు అందుకునే ప్రయత్నం చేస్తోంది.

కీర్తి ప్రస్తుతం నటిస్తున్న ప్రముఖ చిత్రాలలో "రఘు తాతా" ఒకటి. సుమన్‌కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ఎంఎస్ భాస్కర్, రవీంద్ర విజయ్, దేవదర్శిని, రాజీవ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంగీత దర్శకుడు షాన్ రోల్డన్ అందించిన ఈ చిత్ర టీజర్ విడుదలై, ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది.

ఇటీవల, ఈ చిత్రం విడుదల తేదీ ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, "రఘు తాతా" చిత్రం ఆగస్టు 15 విడుదల కానుందని కీర్తి సురేష్ సోషల్ మీడియాలో ప్రకటించింది. అంతా బాగానే ఉంది కాని రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ కాస్త రిస్క్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటేఅదే రోజున, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప 2" కూడా విడుదల కానున్న విషయం తెలిసిందే.

సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది. "పుష్ప" చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ రకమైన పోటీతో కీర్తి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ విధంగా రాణిస్తుందో, ప్రేక్షకులకు ఎలాంటి అనుభవం అందిస్తుందో చూడాలి. ఏమాత్రం తేడా వచ్చినా కూడా కలెక్షన్స్ పై గట్టి ప్రభావం పడుతుంది.

కీర్తి సురేష్ "రఘు తాతా" సినిమాలో భిన్నమైన షేడ్స్ తో కనిపించనుంది. గతంలో ఎప్పుడు లేనంత కొత్తగా ఆమె యాక్టింగ్ ఉండబోతున్నట్లు టాక్ వస్తోంది. ఇక తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా గట్టిగానే విడుదల చేయనున్నారు. ఇక పుష్ప సినిమాకు తమిళంలో ఎంత పోటీని ఇస్తుందో గాని తెలుగులో మాత్రం థియేటర్స్ దొరకడం కూడా కష్టంగానే ఉంటుంది. కాబట్టి రిలీజ్ డేట్ విషయంలో మరోసారి ఆలోచించి వాయిదా వేసుకుంటే బెటర్.