Begin typing your search above and press return to search.

భారతీయుడు-3లో ఆమె సర్ ప్రైజ్.. ఈలలే ఈలలు!

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   12 July 2024 4:45 PM GMT
భారతీయుడు-3లో ఆమె సర్ ప్రైజ్.. ఈలలే ఈలలు!
X

విలక్షణ నటుడు కమల్ హాసన్ ఇండియన్-2 మూవీ.. నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజైన విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహంచిన ఆ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల అయినా.. మిక్స్ డ్ రెస్పాన్స్ అందుకుంటోంది. అయితే మూవీ ఎలా ఉన్నా.. కమల్ హాసన్ మాత్రం తన నటనతో అదరగొట్టేశారని రివ్యూలు వస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే భారతీయుడు పార్ట్ 3 కూడా ఉందని కమల్ హాసన్ చాలా రోజుల క్రితం తెలిపారు. రీసెంట్ గా ప్రమోషన్స్ లో శంకర్ కూడా చెప్పారు. ఇప్పుడు ఇండియన్ 2 మూవీ క్లైమాక్స్ తర్వాత ప్రేక్షకులకు మేకర్స్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఎండింగ్ టైటిల్ కార్ట్స్ ముగిసిన తర్వాత పార్ట్ 3 ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్.. ఇంట్రెస్టింగ్ గా సాగుతూ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. కమల్ సరికొత్త అవతార్ లో కనిపించారు. కాజల్ అదరగొట్టేసింది.

దీంతో సినిమాలో కాజల్ ఉందని అందరికీ క్లారిటీ వచ్చేసింది. అయితే ఇండియన్-2ku గాను మెయిన్ హీరోయిన్ గా కాజల్ ను తీసుకున్నారు శంకర్. మూవీ కోసం కాజల్ పలు విద్యలు కూడా నేర్చుకుంది. కానీ తెలుగు ప్రమోషన్స్ టైమ్ లో శంకర్.. ఇండియన్-2లో కాజల్ కనిపించదని చెప్పి షాక్ ఇచ్చారు. పార్ట్ 3లో ఆమె క‌నిపిస్తుంద‌ని తెలిపారు. ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్ లో కాజల్ ను చూపించారు మేకర్స్. ఆమెపై షూట్ చేసిన సీన్స్.. పార్ట్-3లోనివని అర్థమవుతోంది.

అయితే ట్రైలర్ లో కాజల్ అగర్వాల్.. పోరాటయోధురాలిగా కనిపించి సందడి చేసింది. కాషాయ రంగు దుస్తులు వేసుకుని గుర్రపు స్వారీ చేస్తూ ఎంట్రీ ఇచ్చింది. కమల్ తో కత్తి యుద్ధం జరిగిన సీన్స్ లో అదరగొట్టింది. సినిమాలో యాక్షన్ సీన్స్ చేయడమే కాకుండా గ్లామరస్ కూడా కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. ఆమె రోల్ ను అనేక నెలల క్రితమే షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆమె చాలా స్లిమ్ గా కనిపిస్తోంది.

ఇక పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కాజల్.. ఇప్పుడు మళ్లీ బిజీగా మారుతోంది. గత ఏడాది వచ్చిన నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీలో హీరోయిన్ గా నటించింది. ఇటీవల లేడీ ఓరియంటెడ్ మూవీ సత్యభామతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రీసెంట్ గా ఆ మూవీ ఓటీటీలోకి కూడా వచ్చేసింది. మరిన్ని ప్రాజెక్టుల్లో కాజల్ అవకాశాలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి భారతీయుడు-3తో టాలీవుడ్ చందమామ ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి.