Begin typing your search above and press return to search.

అన్న సినిమా.. తమ్ముడు గెస్ట్‌!

గతంలో రెండు మూడు సార్లు వీరిద్దరు కూడా తమకు మంచి కథ దొరికితే తప్పకుండా కలిసి నటిస్తామని ఫ్యాన్స్ కి హామీ ఇచ్చిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   23 July 2024 4:02 AM GMT
అన్న సినిమా.. తమ్ముడు గెస్ట్‌!
X

తమిళ మెగా బ్రదర్స్ గా పేరు దక్కించుకున్న సూర్య మరియు కార్తీ లు కలిసి నటిస్తే చూడాలని తమిళ్ సినీ ప్రేక్షకులతో పాటు సౌత్‌ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో రెండు మూడు సార్లు వీరిద్దరు కూడా తమకు మంచి కథ దొరికితే తప్పకుండా కలిసి నటిస్తామని ఫ్యాన్స్ కి హామీ ఇచ్చిన విషయం తెల్సిందే.

సూర్య మరియు కార్తీలు ఫుల్‌ లెంగ్త్‌ మూవీ లో ఎప్పుడు నటిస్తారో కానీ ప్రస్తుతానికి అయితే ఫ్యాన్స్ కి ఒక ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ తమిళ మీడియా నుంచి వస్తోంది. సూర్య ఫ్యాన్స్ తో పాటు తమిళ సినీ ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా కంగువ. ఈ సినిమాలో కార్తీ ఉన్నాడట.

ప్రముఖ దర్శకుడు శివ దర్శకత్వంలో రూపొందిన కంగువ సినిమా ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా పడ్డ విషయం తెల్సిందే. ఎట్టకేలకు అక్టోబర్‌ 10న సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి వాయిదా అనేది ఉండదు అంటూ మేకర్స్ బలంగా ప్రకటించారు.

కంగువ సినిమాకు ఉన్న క్రేజ్ ను మరింతగా పెంచేందుకు గాను దర్శకుడు శివ ఈ సినిమాలో కార్తీ తో చిన్న పాత్ర చేయించాడట. కథకు కీలకం అయిన ఆ గెస్ట్‌ రోల్‌ ను కార్తీ చేస్తే బాగుంటుంది అంటూ శివ భావించాడని, కార్తీ కూడా వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

సూర్య మరియు కార్తీల కాంబోలో సన్నివేశాలు ఉంటాయా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా కొనసాగుతుంది. ఇద్దరి కాంబోలో సన్నివేశాలు లేకున్నా కూడా ఒకే సినిమాలో మెగా బ్రదర్స్ ఉండటం వల్ల సినిమాకు మంచి బజ్ క్రియేట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మాతలు స్టూడియో గ్రీన్ సంస్థ తో కలిసి నిర్మిస్తున్నారు. దిశా పటానీ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్‌, యోగి బాబు ఇంకా ప్రముఖ తమిళ నటీనటులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.