Begin typing your search above and press return to search.

పుష్ప-2 రిలీజ్.. ఆ మిడ్ రేంజ్ హీరోల పరిస్థితేంటి?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ ఎన్నికల వల్ల మే నుంచి జూన్ కు పోస్ట్ పోన్ చేశారు.

By:  Tupaki Desk   |   17 Jun 2024 1:30 AM GMT
పుష్ప-2 రిలీజ్.. ఆ మిడ్ రేంజ్ హీరోల పరిస్థితేంటి?
X

టాలీవుడ్ లో సంక్రాంతి తర్వాత ఒక్క బడా హీరో సినిమా కూడా రిలీజ్ కాలేదన్న విషయం తెలిసిందే. వేసవిలో రిలీజ్ అవ్వాల్సి ఉన్న రెండు సినిమాలు కూడా పోస్ట్ పోన్ అయ్యాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ.. ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉండగా అక్టోబర్ కు వాయిదా వేశారు. రీసెంట్ గా సెప్టెంబర్ కు మళ్లీ ప్రీ పోన్ చేశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ ఎన్నికల వల్ల మే నుంచి జూన్ కు పోస్ట్ పోన్ చేశారు.

దీంతో 2024 సెకండాఫ్ లోనే పెద్ద చిత్రాలన్నీ వరుసగా రిలీజ్ కానున్నాయి. తొలుత కల్కి తో స్టార్ట్ అవ్వగా.. ఆ తర్వాత పుష్ప-2, ఓజీ, దేవర, గేమ్ ఛేంజర్ థియేటర్లలోకి రానున్నాయి. మధ్యలో కమల్ హాసన్, రజనీకాంత్ చిత్రాలు ఇండియన్-2, వేట్టయాన్ కూడా రిలీజ్ అవ్వనున్నాయి. అయితే పెద్ద హీరోల సినిమాలు షెడ్యూల్ అయిపోవడంతో.. మిడ్ రేంజ్ హీరోలంతా సేఫ్ డేట్ చూసుకుని తమ చిత్రాలతో రావడానికి రెడీ అయిపోయారు.

కానీ ఇంతలో సీన్ రివర్స్ అయిపోయింది. ఓజీ ఫిక్స్ అయిన డేట్ కు దేవర వస్తోంది. పుష్ప-2 షెడ్యూల్ అయిన తేదీకి డబుల్ ఇస్మార్ట్ వస్తోంది. దీంతో ఓజీ, పుష్ప-2 వాయిదా పడతాయని జోరుగా చర్చ సాగుతోంది. పవన్ ఓజీ వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అవుతుందని వార్తలు వస్తుండగా.. అల్లు అర్జున్ పుష్ప-2 మాత్రం క్రిస్మస్, లాంగ్ వీకెండ్ సందర్భంగా డిసెంబర్ 20వ తేదీన థియేటర్లలో రిలీజ్ అవుతుందని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది.

అదే కనుక నిజమైతే.. నాగ చైతన్య తండేల్ తో పాటు నితిన్ రాబిన్ హుడ్ మూవీల మేకర్స్ కు పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఎందుకంటే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఆ రెండు సినిమాలను డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయాలని ఆయా మేకర్స్ యోచిస్తున్నారు. కానీ పుష్ప-2 అప్పుడే రిలీజ్ అయితే రెండూ తప్పుకోవాలి. అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఒకటి గీతా ఆర్ట్స్ నిర్మిస్తుండగా.. మరొకటి మైత్రీ వాళ్లది. కానీ మళ్లీ కొత్త డేట్స్ వెత్కుకోవడమే పెద్ద పని.

అలా అని పుష్ప-2 ఆగస్టులోనే వచ్చేస్తే.. ఆ రెండు సినిమాలు సేఫ్ అనుకోవడం కూడా కష్టమే. ఎందుకంటే రామ్ చరణ్, శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ డిసెంబర్ లో విడుదలవుతుందని అంటున్నారు. అయితే గత ఏడాది డిసెంబర్ లో ఏం జరిగిందో గుర్తుందా? ప్రభాస్ సలార్ మూవీ సడెన్ గా పోస్ట్ పోన్ అయింది. దీంతో అప్పటికే డిసెంబర్ లో షెడ్యూల్ అయి ఉన్న అనేక సినిమాల వసూళ్లు భారీగా దెబ్బతిన్నాయి. కాబట్టి ఈసారి అలా జరగకుండా చూసుకోవాలని మేకర్స్ కు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ సజ్జెస్ట్ చేస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.