Begin typing your search above and press return to search.

పుష్ప2 కు పోటీగా మరొకటి.. ముప్పేవరికి?

పుష్పకి సీక్వెల్ గా వస్తోన్న మూవీ కావడంతో భారీ క్రేజ్ నెలకొని ఉంది.

By:  Tupaki Desk   |   8 Jun 2024 8:28 AM GMT
పుష్ప2 కు పోటీగా మరొకటి.. ముప్పేవరికి?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి ఆగష్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోయే మూవీ పుష్ప2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా ఉంది. దేశ వ్యాప్తంగా ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే ఆల్ మోస్ట్ అన్ని భాషలకి సంబందించిన బిజినెస్ డీల్స్ క్లోజ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. పుష్పకి సీక్వెల్ గా వస్తోన్న మూవీ కావడంతో భారీ క్రేజ్ నెలకొని ఉంది.

ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన రెండు సాంగ్స్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. దీనిని బట్టి పుష్ప 2 మూవీకి దేశ వ్యాప్తంగా ఏ స్థాయిలో స్పందన ఉందో అర్ధం చేసుకోవచ్చు. బాలీవుడ్ లో చాలామంది పెద్ద హీరోలు పుష్ప 2కి పోటీగా తమ సినిమాలు రిలీజ్ చేయడానికి ఆలోచిస్తున్నారు.

అజయ్ దేవగన్ సింగం 3 మూవీ ఆగష్టు 15కి ఎనౌన్స్ చేసి మళ్ళీ వెనక్కి తగ్గారు. పుష్ప 2 పట్ల తెలుగు కంటే హిందీలోని ఆడియన్స్ ఎక్కువ వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప2కి పోటీగా వెళ్తే నష్టపోతామని భావించి చాలా మంది నిర్మాతలు వెనక్కి తగ్గుతున్నారు. అయితే బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం మాత్రం పుష్ప2కి పోటీగా ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అయ్యాడు.

యాక్షన్ చిత్రాలకి కేరాఫ్ అయిన జాన్ అబ్రహం వేద మూవీతో రాబోతున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ పై అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చింది. సత్యమేవ జయతే 2తో జాన్ అబ్రహం సక్సెస్ అందుకున్నారు. వేద కూడా యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతోనే తెరకెక్కుతోంది. ఈ సినిమాపై జాన్ అబ్రహం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అందుకే పుష్ప 2 క్రేజ్ బాలీవుడ్ నాట ఉన్న కూడా వేద రిలీజ్ ఎనౌన్స్ చేశారు.

అయితే వేద కారణంగా హిందీలో పుష్ప2కి వచ్చే థియేటర్స్ సంఖ్య తగ్గుతుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. సలార్ మీద డంకీ ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్లుగానే పుష్ప2పై కూడా ఎంతో కొంత వేద ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే పుష్ప2కి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం వేదకి ఇబ్బంది తప్పదని అంటున్నారు. మరి ఈ రెండు సినిమాల పోటీలో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఏ చిత్రం బలంగా నిలబడుతుందనేది చూడాలి.