Begin typing your search above and press return to search.

మెగా ఫ్యాన్స్ డౌట్లు క్లియర్ అయినట్టేనా..?

సినిమా చూసిన ఆడియన్స్ అంతా రెహమాన్ మ్యూజిక్ ముఖ్యంగా బిజిఎం గురించి మాట్లాడుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   27 July 2024 9:27 AM GMT
మెగా ఫ్యాన్స్ డౌట్లు క్లియర్ అయినట్టేనా..?
X

ఒక సినిమా సక్సెస్ మరో సినిమాకు జోష్ ఇస్తుంది అంటే కొన్నిసార్లు దాని వెనుక రీజన్స్ ఏంటన్నది చెప్పడం కష్టం కానీ మరికొన్నిసార్లు మాత్రం ఆ విషయంపై క్లారిటీ వస్తుంది. రీసెంట్ గా రాయన్ సినిమాతో ధనుష్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందించారు. సినిమా చూసిన ఆడియన్స్ అంతా రెహమాన్ మ్యూజిక్ ముఖ్యంగా బిజిఎం గురించి మాట్లాడుకుంటున్నారు.

ఒకప్పుడు తన సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టిన రెహమాన్ ఈమధ్య తన స్థాయికి తగిన మ్యూజిక్ కంపోజ్ చేయట్లేదన్న కామెంట్ తెలిసిందే. ఐతే రాయన్ సినిమా చూశాక మాత్రం రెహమాన్ రేసులో ఇంకా ఉన్నాడన్న విషయాన్ని చెప్పకనే చెప్పాడు. రాయన్ సినిమాకు ఎలాంటి బిజిఎం కావాలో సినిమా మూడ్ కు తగినట్టుగా ఇచ్చాడు. సినిమాలో కథ ఇంకాస్త కొత్తగా ఉంటే ఈ టేకింగ్, మ్యూజిక్ కు నెక్స్ట్ లెవెల్ లో రిజల్ట్ ఉండేది.

ఐతే రెహమాన్ రాయన్ సినిమాకు ఇచ్చిన మ్యూజిక్ చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. ఎందుకంటే ఆయన చేస్తున్న నెక్స్ట్ సినిమా చరణ్ తోనే కాబట్టి ఫ్యాన్స్ లో ఎక్కడో ఒక చిన్న అనుమానం ఉంది. కానీ రాయన్ చూశాక అవన్ని తొలగిపోయాయి. ఐతే రెహమాన్ డైరెక్ట్ మ్యూజిక్ చేసిన తెలుగు సినిమాకు పెద్దగా సక్సెస్ అవ్వలేదు. తమిళ్, తెలుగు కలిసి చేసిన బైలింగ్వల్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

ఇక మరోపక్క ఉప్పెన డైరెక్ట్ర్ బుచ్చిబాబుకి కూడా మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. ఉప్పెన కోసం దేవి నుంచి అద్భుతమైన సాంగ్స్ రాబట్టుకున్నాడు. ఇప్పుడు రెహమాన్ తో కూడా అదే రేంజ్ లో అవుట్ పుట్ తీసుకొచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. చరణ్ 16వ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను గ్లోబల్ రేంజ్ అప్పీల్ ఉండేలా చేస్తున్నారని తెలుస్తుంది. మరి ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తెలుగు సినిమాకు డైరెక్ట్ మ్యూజిక్ అందిస్తున్న రెహమాన్ ఎలాంటి సాంగ్స్, బిజిఎం అందిస్తాడన్నది చూడాలి. రాయన్ మ్యూజిక్ విన్నాక రెహమాన్ మీద నమ్మకం పెరిగింది. ఆర్సీ 16 మ్యూజిక్ పరంగా ఎలాంటి డౌట్లు పెట్టుకోనవసరం లేదని రెహమాన్ ప్రూవ్ చేసుకున్నాడు.