Begin typing your search above and press return to search.

రజనీ 'కూలీ'.. లోకేష్ మళ్ళీ అతడినే..

ప్రస్తుతం జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ డైరెక్షన్ లో వేట్టయాన్ మూవీ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   14 Jun 2024 5:00 AM GMT
రజనీ కూలీ.. లోకేష్ మళ్ళీ అతడినే..
X

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్.. జైలర్ సినిమాతో గట్టి కమ్ బ్యాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన జైలర్ మూవీ ఇచ్చిన జోష్ తో రజనీకాంత్ వరుస చిత్రాలను లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ డైరెక్షన్ లో వేట్టయాన్ మూవీ చేస్తున్నారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, రానా, రితికా సింగ్ తదితరులు యాక్ట్ చేస్తున్న ఈ మూవీ అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో పూర్తి అవ్వనుంది. ఆ తర్వాత తన నెక్స్ట్ సినిమా కూలీని స్టార్ట్ చేయనున్నారు రజనీకాంత్. లియో విజయం తర్వాత స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కొన్ని రోజుల క్రితం మేకర్స్ టైటిల్ అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన టీజర్.. మూవీపై సినీ ప్రియుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది.

గోల్డ్ స్మగ్లింగ్ మాఫియా నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ కీలక పాత్ర పోషిస్తోంది. రజనీ కూతురిగా ఆమె కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పుడు మాలీవుడ్ స్టార్ ఫహాద్ ఫాజిల్ ను లోకేష్ కనగరాజ్ రంగంలోకి దించుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఫహాద్ కూలీ మూవీలో పవర్ ఫుల్ రోల్ చేయనున్నారని తెలుస్తోంది.

అయితే లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో ఇప్పటికే ఫహాద్ వర్క్ చేశారు. కమల్ హాసన్ విక్రమ్ మూవీలో అదిరిపోయే రోల్ లో కనిపించి అందరినీ మెప్పించారు. ఆయన రోల్ కు సూపర్ రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇప్పుడు మరోసారి అలాంటి పవర్ ఫుల్ పాత్రనే ఫహాద్ కోసం లోకేష్ కనగరాజ్ సిద్ధం చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫహాద్ మరోసారి అదరగొట్టనున్నారని అంతా అంటున్నారు.

ఇక కూలీ మూవీ షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని టాక్. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. గిరీష్‌ గంగాధరన్‌ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. కమల్ హాసన్ క్యామియో రోల్ లో కనిపించనున్నారని వినికిడి. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల అవుతుందట. మరి మూవీ ఎలా ఉంటుందో వేచి చూడాలి.