ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ మళ్లీ హిట్ కొట్టేనా...!
సూపర్ స్టార్స్ అయిన సల్మాన్ ఖాన్ మరియు ఆమీన్ ఖాన్ లు ఎప్పటికి హిట్ కొట్టేనో అంటూ వారి వారి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
By: Tupaki Desk | 9 Nov 2023 5:30 PM GMTబాలీవుడ్ లో కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఖాన్ త్రయం ఓ రేంజ్ లో ఊపు ఊపింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు బాలీవుడ్ లో వచ్చే హిట్స్ లో ఖాన్ త్రయం నుంచే ఎక్కువగా ఉండేవి. షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు మాత్రమే బాలీవుడ్ లో స్టార్ హీరోలు అన్నంత రేంజ్ లో వీరి సినిమాలు ఆడేవి. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు పూర్తిగా రివర్స్ అయింది.
పదేళ్ల పాటు షారుఖ్ ఖాన్ తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. పఠాన్ మరియు జవాన్ తో షారుఖ్ గాడిలో పడినట్టుగా అనిపిస్తుంది. డుంకీ సినిమా తో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకునేందుకు షారుఖ్ సిద్ధం అవుతూ ఉన్నాడు. ఖాన్ త్రయం లో షారుఖ్ పరిస్థితి బాగానే ఉంది. కానీ ఇతర ఇద్దరు ఖాన్ ల కెరీర్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు.
సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ దక్కించుకుని చాలా ఏళ్లు అయింది. ఆయన నుంచి వస్తున్న చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. దాంతో త్వరలో రాబోతున్న టైగర్ 3 సినిమా పై చాలా ఆశలు పెట్టుకుని సల్మాన్ ఉన్నాడు. అయితే సినీ విశ్లేషకులు మరియు ప్రేక్షకులు మాత్రం టైగర్ 3 ఫలితంపై నమ్మకంగా కనిపించడం లేదు.
టైగర్ 3 లో సల్మాన్ హిట్ కొడితే షారుఖ్ ఖాన్ మాదిరిగా పుంజుకున్నట్లు అవుతుంది. ఆయన స్టార్ డమ్ కంటిన్యూ అవుతుంది. అలా కాకుంటే హిట్ కోసం మరికొంత కాలం వెయిట్ చేయాల్సి రావచ్చు. ఇక మరో సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ పరిస్థితి కూడా దాదాపుగా సల్మాన్ ఖాన్ మాదిరిగానే ఉంది.
దంగల్ తర్వాత ఆమీర్ ఖాన్ కి సాలిడ్ సక్సెస్ దక్కలేదు. దాదాపు ఏడు ఏళ్లుగా సక్సెస్ కోసం ఈ సూపర్ స్టార్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఈయన కొత్త సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆ సినిమా ఫలితం ఎలా ఉంటుందో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మొత్తానికి ఖాన్ త్రయం లో షారుఖ్ ఖాన్ చాలా కాలం తర్వాత హిట్ కొట్టగా మిగిలిన ఇద్దరు సూపర్ స్టార్స్ అయిన సల్మాన్ ఖాన్ మరియు ఆమీన్ ఖాన్ లు ఎప్పటికి హిట్ కొట్టేనో అంటూ వారి వారి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే వయసు మీద పడింది.. ఇద్దరు కూడా సుదీర్ఘ కాలంగా సినిమాలు చేస్తున్నారు. కనుక మళ్లీ హిట్ కొట్టి ఆ స్థాయికి చేరేనా అనేది అనుమానమే అన్నట్టు కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.