Begin typing your search above and press return to search.

'డాన్ 3'లో శోభిత ప్ర‌త్యేక గీతం?

తాజా స‌మాచారం మేర‌కు.. రణ్‌వీర్ సింగ్ డాన్ 3లో శోభితా ధూళిపాళ నటించే అవకాశం ఉంది.

By:  Tupaki Desk   |   23 Aug 2024 3:00 AM GMT
డాన్ 3లో శోభిత ప్ర‌త్యేక గీతం?
X

ఇటీవ‌లే అక్కినేని నాగ‌చైత‌న్య‌తో శోభిత‌కు నిశ్చితార్థ‌మైంది. త్వ‌ర‌లోనే ఈ జంట వివాహ బంధంతో ఒక‌టి కానున్నారు. అయితే పెళ్లి త‌ర్వాత కూడా శోభిత న‌టిగా కెరీర్ ని కొన‌సాగించ‌నుంద‌ని తాజా ప‌రిణామం చెబుతోంది. శోభిత త‌దుప‌రి క‌థానాయిక‌గా త‌న‌ కెరీర్‌ని కొన‌సాగిస్తుంది. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ నుంచి ఆఫ‌ర్ల‌కు కొద‌వేమీ లేద‌ని తెలిసింది.

తాజా స‌మాచారం మేర‌కు.. రణ్‌వీర్ సింగ్ డాన్ 3లో శోభితా ధూళిపాళ నటించే అవకాశం ఉంది. సూపర్‌హిట్ ఫ్రాంచైజీ మూడవ భాగంలో ప్ర‌త్యేక గీతం కోసం త‌న‌ను మేక‌ర్స్ సంప్రదించారు. తాజా క‌థ‌నాల ప్రకారం శోభిత‌ ప్రస్తుతం ద‌ర్శ‌కుడు ఫర్హాన్ అక్తర్‌తో చర్చలు జరుపుతోంది. అత‌డితో ప‌లుమార్లు సమావేశాలు పూర్త‌య్యాయని తెలిసింది.

త‌న‌దైన బ‌హుముఖ ప్ర‌జ్ఞ‌తో ఇప్ప‌టికే అంద‌రినీ ఆక‌ట్టుకున్న శోభిత డాన్ 3లో ఈ ప్ర‌త్యేక గీతంలో క‌నిపించాల‌ని ఫ‌ర్హాన్ ప‌ట్టుబ‌డుతున్నార‌ని తెలిసింది. శోభిత త‌ప్ప దానికి ఇంకెవ‌రూ అవ‌స‌రం లేద‌ని అత‌డు భావిస్తున్నార‌ట‌. అందువ‌ల్ల శోభిత ఈ అవ‌కాశాన్ని కాద‌న‌లేదు. అయితే ఇంత‌వ‌ర‌కూ ఒప్పంద ప‌త్రాల‌పై ఎలాంటి సంత‌కం చేయ‌లేదు అని టాక్ వినిపిస్తోంది.

డాన్ 3 రిలీజ్ ఎప్పుడు?

డాన్ 3 కంటెంట్ రీత్యా 2025 మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటిగా రికార్డుల్లో ఉంది. గత సంవత్సరం ఫర్హాన్ అక్తర్ ఈ చిత్రం టీజర్‌ను విడుద‌ల చేసారు. రణవీర్ సింగ్ కొత్త డాన్ అని ధృవీకరించి అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే డాన్ 2లో ఉన్న‌ SRKని తిరిగి తీసుకురావాలని ద‌ర్శ‌క‌నిర్మాత ఫ‌ర్హాన్‌ని నెటిజనులు అభ్య‌ర్థించారు. కానీ అత‌డు ర‌ణ‌వీర్‌ని స‌మ‌ర్థించాడు. ర‌ణ‌బీర్ అద్భుతం. బాగా స‌రిపోతాడు! అని అన్నారు. ఇంత‌కుముందు షారూఖ్ ని ఎంపిక చేసిన‌ప్పుడు డాన్ పాత్ర‌లో అమితాబ్ లేకుంటే ఎలా? అని అడిగారు. ఇప్పుడు కూడా అంతే. ర‌ణ‌వీర్ చేయ‌గ‌ల‌డు.. అని స‌మాధాన‌మిచ్చారు. రణవీర్‌తో పాటు ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రంలో కియారా అద్వానీ భాగం కానుంది. ఈ చిత్రం 2025లో థియేటర్లలోకి రానుంది.