స్టార్ హీరోలని డామినేట్ చేస్తోన్న దెయ్యం సినిమా
ఈ మూవీ కచ్చితంగా సక్సెస్ అవుతుందనే అభిప్రాయం తమిళనాట వినిపిస్తోంది.
By: Tupaki Desk | 15 Aug 2024 6:34 AM GMTఆగస్టు 15న ఇండిపెండెంట్స్ సందర్భంగా అన్ని భాషలలో కూడా కొన్ని క్రేజీ మూవీస్ రిలీజ్ అయ్యాయి. తెలుగులో స్ట్రైట్ గా మూడు సినిమాలు థియేటర్స్ లోకి వచ్చాయి. ఈ మూడు కూడా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కావడం విశేషం. అలాగే తమిళంలో మూడు చిత్రాలు పోటీ పడుతున్నాయి. వీటిలో చియాన్ విక్రమ్ తంగలాన్ మూవీ బజ్ పరంగా లీడింగ్ లో ఉంది. ఈ మూవీ కచ్చితంగా సక్సెస్ అవుతుందనే అభిప్రాయం తమిళనాట వినిపిస్తోంది.
ఇక హిందీలో కూడా మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. బాలీవుడ్ లో జెట్ స్పీడ్ తో ఏడాదికి 4-6 సినిమాలు చేస్తూ బిజీ స్టార్ గా ఉన్న అక్షయ్ కుమార్ నుంచి ఆగష్టు 15న ఖేల్ ఖేల్ మే మూవీ థియేటర్స్ లోకి వచ్చింది. హాలీవుడ్ హిట్ మూవీ రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రొమాంటిక్ థ్రిల్లర్ గా ఈ మూవీ ఉండబోతోంది.
స్టార్ క్యాస్టింగ్ ఈ చిత్రంలో గట్టిగానే ఉన్నారు. దాంతో పాటు యాక్షన్ హీరో జాన్ అబ్రహం నుంచి వేదా మూవీ కూడా రిలీజ్ అయ్యింది. హైవోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ కథాంశంతో ఈ సినిమా ఉండబోతోందని ట్రైలర్ తో స్పష్టం అయ్యింది. ఈ రెండు సినిమాలు ప్రమోషన్స్ గట్టిగానే జరిగాయి. వీటికి పోటీగా శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు కాంబినేషన్ లో తెరకెక్కిన హర్రర్ కామెడీ స్త్రీ2 థియేటర్స్ లోకి వచ్చింది.
అయితే క్రేజ్ పరంగా స్టార్ హీరోల సినిమాలు రెండింటిని స్త్రీ2 డామినేట్ చేస్తోందనే మాట వినిపిస్తోంది. టికెట్ బుకింగ్స్ పరంగా కూడా స్త్రీ2 పైన పబ్లిక్ ఎక్కువ ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. బుక్ మై షోలో కేవలం 24 గంటల్లోనే 22 వేల టికెట్స్ ని స్త్రీ2 మూవీ కోసం బుక్ చేసారంట. స్త్రీ2తో పోల్చుకుంటే అడ్వాన్స్ బుకింగ్స్ లో వేదా, ఖేల్ ఖేల్ మే దరిదాపుల్లో కూడా లేదనే టాక్ బిటౌన్ లో నడుస్తోంది.
స్త్రీ మూవీ సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా వస్తోన్న స్త్రీ2పైన కూడా పబ్లిక్ అటెన్షన్ ఎక్కువగా ఉందని సమాచారం. అయితే ఈ మూడు సినిమాలలో ఏది కమర్షియల్ సక్సెస్ అందుకొని బాలీవుడ్ ఇండస్ట్రీకి తిరిగి ఊపిరి పోస్తుందనేది తెలియాల్సి ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు చూసుకుంటే బాలీవుడ్ లో ఒక్క భారీ సక్సెస్ కూడా లేదు. చిన్న సినిమాలుగా వచ్చిన చిత్రాలే ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటున్నాయి. ముంజ్య ఈ మధ్యలో వచ్చిన అతిపెద్ద హిట్ మూవీగా బాలీవుడ్ లో ఉంది. ఇది కూడా హర్రర్ జోనర్ చిత్రమే కావడం విశేషం.